Crime: పోర్న్ సినిమాల్లాగా చేయాలంటూ భార్యపై ఒత్తిడి.. అత్తా, మరిది సైతం

అదనపు కట్నంతోపాటు తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్న భార్య పట్ల దారుణంగా వ్యవహరించాడు ఓ వ్యక్తి. పోర్న్ సినిమాల్లోలాగే చేయాలంటూ ఆమెను టార్చర్ చేశాడు. ఇందుకు అతని తల్లి, తమ్ముడు వత్తాసు పలికారు. నిందితులపై విజయవాడ పటమట పోలీసులు కేసు నమోదు చేశారు.

New Update
Crime: పోర్న్ సినిమాల్లాగా చేయాలంటూ భార్యపై ఒత్తిడి.. అత్తా, మరిది సైతం

Vijayawada: అదనపు కట్నంకోసం ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. పెళ్లై మూడేళ్లు గడిచిన తర్వాత డబ్బు పిచ్చితో భార్యను వేధించడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా నీలిచిత్రాల్లో లాగా ప్రవర్తించాలంటూ టార్చర్ చేశాడు. ఈ దుర్మార్గానికి ఆమె అత్తా, మరిది కూడా భర్తకు మద్ధతు పలకడం విశేషం. కాగా ఈ నీచమైన సంఘటన ఏపీలోని విజయవాడ జిల్లాకు చెందిన పటమటలో చోటుచేసుకుంది.

మరో లక్ష కావాలంటూ..
ఈ మేరకు పటమట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఓ యువతికి కృష్ణా జిల్లా కూచిపూడి చెందిన వ్యక్తితో 2021లో వివాహమైంది. అయితే కట్నం కింద రూ.2లక్షలు, రూ.50వేల విలువైన గృహోపకరణాలు పెళ్లిలోనే ఇచ్చారు. దీంతో ఈ దంపతులు కృష్ణా జిల్లా కూచిపూడిలో కిరాణా హోల్‌సేల్‌ దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో లక్ష రూపాయలు కట్నం కావాలంటూ తరచూ వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి : Jaga Jyoti Arrested: అవినీతి ఆఫీసర్ జగజ్యోతి అరెస్ట్.. 65 లక్షల నగదు, 4కిలోల బంగారం స్వాధీనం!

తల్లి, తమ్ముడు వత్తాసు..
అలాగే ఈ దుర్మార్గ పనులకు అతని తల్లి, తమ్ముడు కూడా వత్తాసు పలుకుతున్నారు. దుకాణంలో పనిచేసే యువతితో భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు గుర్తించిన భార్య నిలదీసింది. దీంతో బ్లూ ఫిల్మ్స్ చూపిస్తూ అలాగా ప్రవర్తించాలని ఒత్తిడి చేస్తున్నాడని, ఆయన వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వచ్చేసిన భాదితురాలు అతని బాగోతం మొత్తం బయటపెట్టింది. దిశ పోలీసులు ఆమె భర్త, అత్త, మరిదిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఎవరిపేర్లు బయటపెట్టలేదు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు