Hurricane Beryl: టెక్సాస్‌లో బెరిల్ హరికేన్ బీభత్సం.. ! అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో బెరిల్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. బెరిల్ కారణంగా వీస్తున్న బలమైన గాలులు, కుండపోత వర్షం కారణంగా సోమవారం టెక్సాస్‌లో ముగ్గురు మృతి చెందారు.తుపాను వల్ల విద్యుత్ ప్రసారానికి అంతరాయం ఏర్పడటంతో 2.7 మిలియన్లకు పైగా ప్రజలు అంధకారంలోకి వెళ్లిపోయారు. By Bhavana 09 Jul 2024 in ఇంటర్నేషనల్ వాతావరణం New Update షేర్ చేయండి Hurricane Beryl: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో బెరిల్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. బెరిల్ కారణంగా వీస్తున్న బలమైన గాలులు, కుండపోత వర్షం కారణంగా సోమవారం టెక్సాస్‌లో ముగ్గురు మృతి చెందారు.తుపాను వల్ల విద్యుత్ ప్రసారానికి అంతరాయం ఏర్పడటంతో 2.7 మిలియన్లకు పైగా ప్రజలు అంధకారంలోకి వెళ్లిపోయారు.వరద నీటి తాకిడి వల్ల రహదారులు దెబ్బతినడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వేలాదిగా వ్యాపారాలు మూతపడ్డాయి. అలాగే 1,300కు పైగా విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. ఇక గత వారం బెరిల్ హరికేన్.. జమైకా, గ్రెనడా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్ లో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఇది టెక్సాస్‌కు చేరుకునేలోపే మెక్సికో, కరేబియన్‌లలో కనీసం 11 మందిని మింగేసింది. తుపాను వల్ల హ్యూస్టన్ ప్రాంతంలో ఇళ్లపై చెట్లు కూలిన ఘటనలో 53 ఏళ్ల వ్యక్తి, 74 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందారు. అలాగే హ్యూస్టన్ నగరానికి చెందిన ఓ ఉద్యోగి పనికి వెళ్తున్న సమయంలో అండర్‌పాస్‌లో మునిగి చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం అర్థరాత్రి నుంచే గాల్వెస్టన్, సార్జెంట్, లేక్ జాక్సన్, ఫ్రీపోర్ట్ వంటి నగరాల్లో బలమైన ఈదురుగాలులు, కుండపోత వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం తెల్లవారుజామున హ్యూస్టన్‌లో చాలా చెట్లు నేలకూలాయి. ఇక భారీగా పొటెత్తిన వరదల వల్ల రహదారులు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. Also read: కుండపోత వానలకు ఉత్తరాది రాష్ట్రాలు కకావికలం #texas #hurricane #beryl మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి