తెలంగాణలో హంగ్ వస్తుంది.. ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు! తెలంగాణలో హంగ్ వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. BRS, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. ఈ సారి ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. By V.J Reddy 05 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి TS ELECTIONS: తెలంగాణలో నాయకుల ప్రచారాలతో రాజకీయాలు వేడెక్కాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో అన్ని పార్టీల రాజకీయ నాయకులు ప్రజల్లోకి వెళ్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్(Arvind Dharmapuri) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం లేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి మెజారిటీ వస్తుంది.. లేదంటే హంగ్ వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ మెజారిటీ వచ్చినా.. హంగ్ వచ్చినా బీజేపీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఎన్నికల ముందు, తర్వాత కూడా రాజకీయాలు ఉంటాయని పేర్కొన్నారు. ఏదిఏమైనా తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. 6 గ్యారెంటీలతో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో ఆలౌట్ కావడం ఖాయమని అన్నారు. ALSO READ: కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి! మరోవైపు బీజేపీ ఎంపీ లక్ష్మణ్(MP Laxman) కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రజలు నమ్మొద్దు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఉచితాలతో ప్రజలను కాంగ్రెస్ మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. అటూ సీఎం కేసీఆర్ కూడా అన్నీ తప్పుడు హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ డిఎన్ఏ ఒక్కటే అని విమర్శించారు. సీఎం కేసీఆర్‌పై పోటీగా బరిలో దిగుతున్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్(Etela Rajender) తనదైన ప్రచారశైలితో గజ్వేల్ ప్రజల చెంతకు చేరుతున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "నేను సీఎం కేసీఆర్ బాధితుడిని కాబట్టే గజ్వేల్‌లో కేసీఆర్ బాధితులకు తోడుగా వచ్చా.. తెలంగాణ ప్రజలకు నేను కాపలాదారు.. గజ్వేల్ ప్రజలంతా బీజేపీకే తమ ఓటు అని అంటున్నారు" అని అన్నారు. ALSO READ: ఈ నెల 7న అకౌంట్లోకి డబ్బు జమ #telangana-election-2023 #etela-rajender #bjp-mp-arvind-kumar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి