Hyderabad: హైదరాబాద్‌లో ఈరోజు భారీ వర్షం..జీహెచ్ఎంసీ హెచ్చరిక

సాయంత్రం బయటకు వెళుతున్నారా...పనులు చేసుకుందామనుకుంటున్నారా...అయితే అవన్నీ వెంటనే క్యాన్సిల్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వష్ం పడనుంది. అవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దని జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ హెచ్చరించారు.

Weather Alert: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోడ్లన్ని జలమయం
New Update

Huge Rain In Hyderabad : మాన్‌సూన్ (Monsoon) వచ్చేసింది. అప్పుడప్పుడూ వర్షాలు (Rains) పడుతున్నాయి. ఒక్కోసారి పెద్ద వానల ముంచుకొస్తున్నాయి. హైదరాబాద్‌ (Hyderabad) కు మళ్ళీ భారీ వర్షం తరుముకొచ్చేస్తోంది. ఈరోజు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఇక్కడ అతి పెద్ద వర్షం పడనుంది. ఆగకుండా కూడా వాన కురవచ్చని వాతావరణశాఖ తెలిపింది. దీంతో సాయంకాలం నుంచి ఎవరూ బయటకు రావోద్దని హెచ్చరిస్తోంది జీహెచ్ఎంసీ.

బయటకు రావొద్దు.. 

అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని చెబుతున్నారు జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు. ఆఫీస్‌, ఇతర పనుల మీద బటయకు వెళ్ళినవారు తొందరగా ఇంటికి వచ్చేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా వచ్చేస్తే మంచిదని హెచ్చరించారు. ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం పడే సూచన ఉంది కావున శిథిల భవనాలు, చెట్ల కింద ఉండొద్దని చెబుతోంది జీహెచ్ఎంసీ (GHMC). అత్యవసర సమయాల్లో సహాయం కోసం 90001 13667 నంబర్‌కు కాల్‌ చేయాలని తెలిపింది.

Also Read:Russia: రష్యాలో నదిలో మునిగి నలుగురు భారత విద్యార్ధులు మృతి

#hyderabad #alert #huge-rain #ghmc
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe