Job Mela in Telangana: తెలంగాణలో భారీ జాబ్ మేళా.. 70 కంపెనీల్లో 2500+ జాబ్స్.. రిజిస్ట్రేషన్ లింక్ ఇదే!

నిరుద్యోగులకు శుభవార్త. అక్టోబర్ 9న మహబూబాబాద్ లోని న్యూ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే శంకర్ నాయక్ తెలిపారు. సూర్య చంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. అక్టోబర్ 9న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఈ జాబ్ మేళా కొనసాగుతుందని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ ఉదయం 9గంటల మహబూబాబాద్ న్యూ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు అన్ని ధ్రువపత్రాలతో హాజరు కావాలని తెలిపారు.

New Update
Gate 2024 : గేట్ 2024 కోసం దరఖాస్తుకు నేడే చివరి తేదీ..దరఖాస్తుకు డైరెక్ట్ లింక్ ఇదే..!!

Job Mela in Telangana: నిరుద్యోగులకు శుభవార్త. అక్టోబర్ 9న మహబూబాబాద్ (Mahbubabad) లోని న్యూ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే శంకర్ నాయక్ (Banoth Shankar Naik) తెలిపారు. సూర్య చంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. అక్టోబర్ 9న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ జాబ్ మేళా కొనసాగుతుందని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ ఉదయం 9 గంటల మహబూబాబాద్ న్యూ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు (MLA Camp Office) అన్ని ధ్రువపత్రాలతో హాజరు కావాలని తెలిపారు.

ఉద్యోగ కల్పనే లక్ష్యంగా వివిధ రంగాలకు ప్రైవేటు సంస్థల ప్రతినిధులు, నిరుద్యోగ యువతకు పలు ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ఈ ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉద్యోగమేళాలో పలు ప్రైవేట్ కంపెనీలు పాల్గొనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు న్యూ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఉన్న నిరుద్యోగల యువత, పదోతరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లోమా, గ్రాడ్యుయేషన్, పీజీ చదివిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. నిరుద్యోగులు పాల్గొని ఉద్యోగా అవకాశాలను పొందాలని ఆయన వివరించారు. పూర్తి వివరాలు, సమాచారం కోసం 8978347245, 80193 97245 నెంబర్లను సంప్రదించాలని కోరారు.

ఇది కూడా చదవండి: ఒళ్లు గగుర్పొడిచేలా వార్‌ వీడియోలు..భయంకర దాడులు.. 298 మంది మృతి..!

మీ డ్రీమ్ జాబ్‌ని పొందేందుకు ఈ అవకాశాన్ని కోల్పోకండి. మీ భవిష్యత్తు వేచి ఉంది! మెగా జాబ్ మేళాలో కలుద్దాం. మీ కెరీర్ కలలను నిజం చేద్దామంటూ తెలిపారు.

Advertisment