Fire accident : హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం!

నగరంలోని మైలార్‌దేవ్‌ పల్లిలోని టాటానగర్‌ లో ఉన్న ఓ ప్లాస్టిక్ గోడౌన్‌ లో ఆదివారం అర్థరాత్రి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

New Update
Fire accident : హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం!

హైదరాబాద్‌(Hyderabad) : లో భారీ అగ్ని ప్రమాదం (Fire accident) జరిగింది. ఓ ప్లాస్టిక్ గోడౌన్ (Plastic Godown)లో అర్థరాత్రి వేళ ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మైలార్‌దేవ్‌ పల్లిలోని స్థానిక టాటా నగర్ లోని ఓ ప్లాస్టిక్‌ గోడౌన్‌ లో మంటలు చెలరేగాయి.

మంటలను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు , అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్లాస్టిక్‌ వస్తువుల గోడౌన్ కావడంతో మంటలు త్వరగా వ్యాపించాయి. మంటల వల్ల చుట్టుపక్కల అంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. దీని వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

మంటలను అదుపు చేసేందుకు అగ్ని మాపక సిబ్బందికి సుమారు 4 గంటల సమయం పట్టింది. మంటల వల్ల ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. గోడౌన్‌ లో ఉన్న ప్లాస్టిక్‌ వస్తువులు మొత్తం పూర్తిగా కాలిపోవడం వల్ల భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు స్థానికులు, పోలీసులు తెలిపారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దాని మీద విచారణ చేపట్టారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ప్రమాదం జరిగిందా..లేక ఎవరైనా కావాలని కుట్ర చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.

Also read: కాచిగూడ నుంచి శబరిమలకు 5 స్పెషల్ ట్రైన్లు.. డేట్స్, టైమింగ్స్ ఇవే!

Advertisment
తాజా కథనాలు