Bastar : ఎన్ కౌంటర్‌ లో మృతి చెందిన వారిని గుర్తించిన అధికారులు!

ఎన్‌ కౌంటర్ లో మృతి చెందిన 29 మంది మావోయిస్టులను పోలీసులు గుర్తించారు. వారిలో తెలంగాణకు చెందిన ముఖ్యనేతలు శంకర్‌, లలిత, సుజాత ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.శంకర్‌ స్వగ్రామం చల్లగరిగె, చిట్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా .

New Update
Bastar : ఎన్ కౌంటర్‌ లో మృతి చెందిన వారిని గుర్తించిన అధికారులు!

Encounter : చత్తీస్‌గడ్‌(Chhattisgarh) లోని బస్తర్ ప్రాంతం(Bastar Area) లో భారీ ఎన్‌ కౌంటర్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌ కౌంటర్‌ లో 29 మంది మావోయిస్టులు(Maoists) మరణించారు. శుక్రవారం నాడు బస్తర్‌ సెగ్మెంట్‌ కు తొలి విడత లోక్‌ సభ ఎన్నికలు(Lok Sabha Elections) జరగనున్నాయి. ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు మావోయిస్టులు లేఖను విడుదల చేశాయి.

దీంతో మావోయిస్టులు దాడులకు దిగుతారనే సమాచారంతో భద్రతా బలగాలు ముందుగానే అలర్ట్‌ అయ్యాయి. కాంకేర్ జిల్లాలోని అడవుల్లో బీఎస్ఎఫ్, డీఆర్​జీ బలగాలు కూంబింగ్​ ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో మంగళవారం భద్రతా బలగాల రాకను గమనించిన మావోయిస్టులు.. ఒక్కసారిగా దాడులకు పాల్పడ్డారు. వెంటనే బలగాలు కూడా ప్రతిదాడికి దిగాయి. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 2 గంటల వరకు భీకరమైన కాల్పులు జరిగాయి.

కాల్పుల అనంతరం ఘటనా స్థలంలో 29 మంది మావోయిస్టుల డెడ్​బాడీలను పోలీసులు గుర్తించారు. మృతుల్లో తెలంగాణ(Telangana) క్యాడర్​కు చెందిన కమాండర్ శంకర్​రావు, లలిత, సుజాత ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. వీరిలో శంకర్‌ స్వగ్రామం చల్లగరిగె, చిట్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాగా శంకర్ భార్య దాశ్వర్ సుమన అలియాస్‌ రజిత కూడా చనిపోయిన వారిలో ఉన్నారు. ఆమె సొంతూరు బజార్ హత్నూర్, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాగా అధికారులు పేర్కొన్నారు. ఎన్ కౌంటర్ లో బీఎస్ఎఫ్​ఇన్​స్పెక్టర్, మరో ఇద్దరు డీఆర్​జీ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హెలికాప్టర్​లో రాయ్​పూర్​కు తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.

ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉంది. ఘటనా స్థలంలో ఐదు ఏకే 47, 303 రైఫిల్స్, ఇన్సాస్​లు, రాకెట్​లాంఛర్లు స్వాధీనం చేసుకున్నారు. మందుపాతరలు, నిత్యావసర సామగ్రి, విప్లవ సాహిత్యం దొరికాయి. కూంబింగ్​కు వెళ్లిన బలగాల కోసం బ్యాకప్​టీమ్స్ పంపించామని, వాళ్లు తిరిగొచ్చాక పూర్తి వివరాలు అందిస్తామని బస్తర్​ఐజీ సుందర్ రాజ్, కాంకేర్​ఎస్పీ ఇంద్రకల్యాణ్ తెలిపారు.

Also read: నిప్పుల కొలిమిల తెలంగాణ ..ఇప్పటికే వడదెబ్బతో ఇద్దరు మృతి.. మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు!

Advertisment
తాజా కథనాలు