OnePlus Nord 3 5G : కొత్త ఫోన్ కొనేవారికి శుభవార్త... ఈ స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపు...ఆ కార్డులుంటే అదనపు డిస్కౌంట్..!!

మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే మీకు గుడ్ న్యూస్. రూ. 37వేల వన్ ప్లస్ నార్డ్ 3 5జీ స్మార్ట్ ఫోన్ రూ. 4 వేల డిస్కౌంట్ తో రూ. 33వేలకే విక్రయిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 2వేల డిస్కౌంట్ అందిస్తోంది.

New Update
OnePlus Nord 3 5G  : కొత్త ఫోన్ కొనేవారికి శుభవార్త... ఈ స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపు...ఆ కార్డులుంటే అదనపు డిస్కౌంట్..!!

వన్ ప్లస్ నార్డ్ 3 5జీ (OnePlus Nord 3 5G) ఈ ఏడాది జూలైలో భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ MediaTek డైమెన్సిటీ ( MediaTek Dimensity) 9000 ప్రాసెసర్, 5,000mAh బ్యాటరీ, 80W వైర్డు SuperVOOC ఛార్జింగ్ వంటి ఫీచర్లతో అందుబాటులోఉంది. అంతేకాకుండా, ట్రై-స్టేట్-అలర్ట్ స్లైడర్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ ఫోన్లను భారీ డిస్కౌంట్లతో కొనుగోలు చేయవచ్చు.

వన్ ప్లస్ నార్డ్ 3 5జీ (OnePlus Nord 3 5G) యొక్క 8GB + 128GB వేరియంట్ భారతదేశంలో లాంచింగ్ సమయంలో రూ . 33,999 అందుబాటులో ఉంది. 16GB + 256GB వేరియంట్ భారతదేశంలో రూ.37,999కి విడుదలయ్యింది. ఇప్పుడు రెండు వేరియంట్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది కంపెనీ. ఈ రెండు స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్ ధరలతో ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి.

వన్ ప్లస్ (OnePlus) అధికారిక వెబ్‌సైట్‌లో, 8GB + 128GB వేరియంట్ రూ. 29,999కి, 16GB + 256GB వేరియంట్ రూ. 33,999కి జాబితా చేయబడింది. గ్రీన్, గ్రే కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కస్టమర్లకు అందుబాటులో ఉంది. ICICI బ్యాంక్, సిటీ బ్యాంక్, వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు కూడా ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు రూ. 2,000 వరకు అదనపు డిస్కౌంట్ ను పొందవచ్చు.

వన్ ప్లస్ నార్డ్ 3 5జీ (OnePlus Nord 3 5G) స్పెసిఫికేషన్‌లు:
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్‌తో 6.74-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ గరిష్టంగా 16GB LPDDR5X ర్యామ్, 256GB వరకు UFS 3.1 స్టోరేజ్, Mali-G710 MC10 GPUతో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 13తో రన్ అవుతుంది.

ఫోటోగ్రఫీ కోసం, ఫోన్ వెనుక భాగంలో 50మెగాపిక్సెల్ Sony IMX890 ప్రైమరీ సెన్సార్, 8మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 2మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం, ఫోన్ ముందు భాగంలో 16మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. ఫోన్ యొక్క బ్యాటరీ 5,000mAh, 80W వైర్డు SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. భద్రత కోసం ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ ఫోన్‌లో ట్రై స్టేట్ అలర్ట్ స్లైడర్ కూడా అందుబాటులో ఉంది.

ఇది కూడా చదవండి: జనవరి 1 నుంచి దేశంలో చాలా మార్పులు జరగబోతున్నాయి..కొత్త నిబంధనల గురించి పూర్తి సమాచారం ఇదే..!!

Advertisment
తాజా కథనాలు