Electric Scooter: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.30 వేల భారీ డిస్కౌంట్.. ఫైనల్ ధర ఎంత తక్కువంటే?

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? యాంపియర్ కంపెనీకి చెందిన ప్రిమస్ స్కూటర్ రూ. 1.46లక్షలు ఉండగా..16శాతం డిస్కౌంట్ తో 1.22లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ఈ బంపర్ డిస్కౌంట్ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది.

New Update
Electric Scooter: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.30 వేల భారీ డిస్కౌంట్.. ఫైనల్ ధర ఎంత తక్కువంటే?

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీకోసం సూపర్ బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీరు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఏకంగా రూ. 30వేలు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్ గురించి పూర్తి డిటైల్స్ తెలుసుకుందాం.

ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీకంపెనీల్లో ఒకటైన యాంపియర్ మోడళ్లపై కిరాక్ డీల్స్ ను అందిస్తోంది. కంపెనీకి చెందిన ప్రిమస్ స్కూటర్ పై భారీ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అందుకే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోనులు చేయాలని భావిస్తేంటే వెంటనే ఈ డీల్ ను పొందవచ్చు. మీరు ఈస్కూటర్ ను ఆన్ లైన్ లో కొనుగోలు చేయవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థల్లో ఒకటిగా నిలిచిన ప్లిప్ కార్టులో భారీ డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది. యాంపియర్ ప్రిమస్ స్కూటర్ ఎంఆర్పీ రూ. 1.46లక్షలుగా ఉంది. అయితే మీరు దీన్ని రూ. 1.22 లక్షలకు కొనుగోలు చేసే అవకాశంఉంది. అంటే ఈ స్కూటర్ పై ఏకంగా 16శాతం డిస్కౌంట్ పొందవచ్చు.

ఇవే కాదు ఇంకా ఎన్నో ఆఫర్లు కూడా ఉన్నాయి. వీటితో అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మీరు ప్లిప్ కార్టు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొన్నట్లయితే మీకు అదనంగా రూ. 6,145 వరకు డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు మీకు ఈ స్కూటర్ రూ. 1.16 లక్షలకు వస్తుంది. అంతేకాదు ఈ స్కూటర్ ను కొనుగోలు చేయాలనుకుంటే మాత్రం ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. నెలవారి ఈఎంఐ రూ. 4321 నుంచి ప్రారంభం కాగా...36 నెలల టెన్యూర్ కు ఇది వర్తిస్తుంది. మీరు 24 నెలల టెన్యూర్ సెలక్ట్ చేసుకుంటే నెలకు రూ. 6వేలు చెల్లించాల్సి ఉంటుంది.

అదే 18నెలల టెన్యూర్ కూడా అందుబాటులోఉంది. నెలకు రూ. 7726 కట్టాలి. ఏడాది పాటు పెట్టుకుంటే నెలకు రూ. 11,151 చెల్లించాల్సి ఉంటుంది. 9నెలల టెన్యూర్ అయితే రూ. 14,600 వరకు ఉంటుంది. ఆరు నెలలు అయితే నెలకు రూ. 21వేలు చెల్లించాల్సి ఉంటుంది. మూడు నెలలు అయితే నెలకు 42వేలు ఉంటుంది. మీరు సెలక్ట్ చేసుకునే టెన్యూర్ పై ఈఎంఐ డిసైడ్ అయి ఉంటుంది. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై 3ఏళ్ల వరకు గ్యారెంటీ కూడా లభిస్తుంది. లేదంటే 30వేల కిలోమీటర్ల వరకు వారంటీ ఉంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 110 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. దీని టాప్ స్పీడ్ గంటకు 78 కిలోమీటర్లు అని కంపెనీ వెల్లడించింది.

ఇది కూడా చదవండి: ఈ కోర్సు చేస్తే భవిష్యత్ బంగారుమయం..పూర్తి వివరాలివే..!!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు