Thane lift collapses: థానేలో భారీ ప్రమాదం..కుప్పకూలిన లిఫ్ట్...ఆరుగురు కార్మికులు మృతి...!!

థానేలో 40 అంతస్తుల భవనం లిఫ్ట్ కూలి ఆరుగురు కార్మికులు మృతి చెందారు. ఇటీవల నిర్మించిన ఈ భవనంలో వాటర్‌ఫ్రూఫింగ్ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

Thane lift collapses: థానేలో భారీ ప్రమాదం..కుప్పకూలిన లిఫ్ట్...ఆరుగురు కార్మికులు మృతి...!!
New Update

మహారాష్ట్రలో విషాదం నెలకొంది. థానేలోని బాల్‌కుంబ్ ప్రాంతంలోని 40 అంతస్తుల భవనంలో ఆదివారం భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భవనం లిఫ్ట్ కూలిపోవడంతో 6 మంది మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పై అంతస్తులో వాటర్‌ఫ్రూఫింగ్ పనులు పూర్తి చేసి, సర్వీస్ లిఫ్ట్ నుంచి కిందకు వస్తుండగా, ప్రమాదం జరిగిందని థానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారి తెలిపారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. భవనంలోని లిఫ్ట్‌లో జరిగిన ప్రమాదం ఎత్తైన భవనాల భద్రతపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తుతోంది. లిఫ్ట్ తాడు తెగిపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: చంద్రబాబుకు జైల్లో ప్రత్యేక వసతులు.. ఎలాంటి ఫెసిలిటీస్ అంటే..

థానే పోలీసుల ప్రకారం, మరణించిన ఆరుగురు ఒకే భవనంలో కొన్ని నెలలుగా పనిచేస్తున్నారు. 40 అంతస్తుల భవనం పైన వాటర్ ప్రూఫింగ్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. పని ముగించుకుని కూలీలంతా లిఫ్ట్‌ నుంచి కిందకు వస్తుండగా లిఫ్ట్‌ కిందపడిపోయింది. నిర్మాణంలో ఉన్న భవనం లిఫ్టు విరిగిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని, ఇందులో మరో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడని చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహా విపత్తు సహాయక బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.

ఈ ఘటన సాయంత్రం చోటు చేసుకుంది. కూలీలంతా రోజు పని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. భవనం పై అంతస్తులో కార్మికులు వాటర్‌ఫ్రూఫింగ్ పనులు చేస్తున్నారు. సర్వీస్ లిఫ్ట్ నుంచి కిందకు తిరిగి వస్తుండగా లిఫ్టు తాడు తెగి ఈ ఘటనలో 6 మంది మృతి చెందారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, అంబులెన్స్, రిలీఫ్ అండ్ రెస్క్యూ టీమ్‌ను వెంటనే పిలిపించారు. కొద్దిసేపటికే పోలీసు బృందం కూడా వచ్చి విచారణ చేపట్టారు.

ఇది కూడా చదవండి: ‘బరువెక్కిన గుండెతో రాస్తున్న’.. తెలుగు ప్రజానికానికి నారా లోకేష్ లేఖ..

ఠాణేలో కొత్తగా నిర్మించిన 40 అంతస్తుల రన్‌వాల్‌ భవనంలో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు . ఈ బహుళ అంతస్తుల భవనం పైకప్పుపై వాటర్ ప్రూఫింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. మరణించిన కార్మికులందరూ అదే పనిలో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేశారు. లోతుగా విచారణ జరుపుతామని పోలీసులు చెబుతున్నారు.

#thane-lift-collapses #lift-safety #thane #lift-collapse #lift-accident #maharashtra
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe