/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-03T170518.522.jpg)
కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి ఊర్లకు ఉర్లే కొట్టుకుపోయాయి. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇప్పటి వరకు 358 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య అంతకంతూ పెరుగుతోంది. రెస్య్కూ టీం, సైనికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే ఓ రెస్క్యూ బృందం అడవిల్లో చిక్కుకున్న ఓ గిరిజిన కుటుంబాన్ని రక్షించిన వీడియో వైరల్ అవుతోంది.
Also Read: దేశంలో ప్రకృతి వైపరిత్యాలు.. మానవ తప్పిదాలేనా? క్లౌడ్ బరస్ట్ శాతం ఎంత!
ఇక వివరాల్లోకి వెళ్తే.. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో సహాయక బృందాలు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ అటవీ ప్రాంతంలో లోయకు ఎదురుగా ఉన్న ఒక కొండపై ఓ గిరిజన కుటుంబం చిక్కుకుంది. దీన్ని గమనించిన రెస్క్యూ టీం ఎలాగైనే వారిని కాపాడాలనే ఉద్దేశంతో 8 గంటల పాటు శ్రమించారు. తాళ్ల సాయంతో కొండపైకి చేరుకుని నలుగురు పిల్లలు, వారి తల్లిని సురక్షితంగా రక్షించారు. భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ కుటంబం కొండపై ఉన్న ఓ గుహలో తలదాచుకుంది. దాదాపు 5 రోజులుగా వాళ్లు తిండి లేకుండా ఉన్నట్లు తెలుస్తోంది. రెస్క్యూ వాళ్లను కాపాడిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సహాయక సిబ్బందిపై నెటీజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Team of Kerala Forest Officers Trekked deep down into the dense forest for 8 hrs & Saved 4 Tribal Toddlers & Mother who were hiding in a cave & starving from nearly 5 days
Salute to Real Heroes 🔥🫡#WayanadDisaster #Wayanad #Army
pic.twitter.com/mJ78gpRuzx— Veena Jain (@DrJain21) August 3, 2024
Also Read: వయనాడ్ బాధితులకు అండగా కర్ణాటక.. 100 ఇళ్లు కట్టిస్తామని ప్రకటన