Walking : ప్రతిరోజూ ఎన్ని అడుగులు వేయాలి? దీర్ఘకాలిక వ్యాధులకు చెక్‌ పెట్టండిలా!

రోజువారీ నడక గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజూ 10000 అడుగులు నడవడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. క్రమం తప్పకుండా నడకతో సహా వ్యాయామం చేయడం వల్ల 'ఫీల్ గుడ్' హార్మోన్లు రిలీజ్ అవుతాయి.

New Update
Walking : ప్రతిరోజూ ఎన్ని అడుగులు వేయాలి? దీర్ఘకాలిక వ్యాధులకు చెక్‌ పెట్టండిలా!

Health Care : శారీరక ఆరోగ్యం(Physical Health) తో పాటు మానసిక ఆరోగ్యాన్ని(Mental Health) కూడా జాగ్రత్తగా చూసుకోవడం మనందరికీ చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు(Health Professionals) అంటున్నారు. సాధారణంగా మనమందరం శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటాం కానీ మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకోం. కానీ ఈ రెండిటిని బ్యాలెన్సడ్‌ కాపాడుకోవడం చాలా చాలా ముఖ్యం. కొన్ని జీవనశైలి అలవాట్లు మీ శారీరక , మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోజువారీ నడక అలవాటు మీ మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

Walking

రోజూ ఎన్ని అడుగులు నడవాలి?
రోజూ 10,000 అడుగులు నడవడం(Walking) వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని పరిశోధనలో తేలింది. రోజువారీ నడక గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మెదడు ఆరోగ్యాన్ని(Brain Health) మెరుగుపరుస్తుంది. జామా న్యూరాలజీ అండ్ జామా ఇంటర్నల్ మెడిసిన్ లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో ప్రకారం మీరు రోజూ 10,000 అడుగులు నడవడం అలవాటు చేసుకుంటే, అది అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. రోజుకు 10,000 అడుగులు నడవడం వల్ల బరువు తగ్గడం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, స్ట్రోక్‌ను నివారించే అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా గుండె సమస్యలున్నవారు వాకింగ్ అలవాటు చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

మానసిక ఆరోగ్యానికి కూడా ఇదే చిట్కా:
10,000 అడుగులు నడిచే అలవాటు మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకవేళ మీరు రోజూ 4000 అడుగుల లక్ష్యాన్ని చేరుకున్నా అది కూడా తక్కువేమీ కాదు.. దీని వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా రోజూ 4000 అడుగులు నడిచే అలవాటు మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. నడక అలవాటు చేసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. అంతే కాదు, మీ శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్లను ప్రోత్సహించడానికి, మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి నడక సహాయపడుతుంది. 30-35 నిమిషాల సాధారణ నడక మీ జ్ఞాపకశక్తిని పెంచుతుంది. క్రమం తప్పకుండా నడకతో సహా వ్యాయామం చేయడం వల్ల 'ఫీల్ గుడ్' హార్మోన్‌గా పిలువబడే ఎండార్ఫిన్లు విడుదలవుతాయని పరిశోధకులు తెలిపారు. ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గించడానికి ఎండార్ఫిన్లు సహాయపడతాయి.

Also Read : డ్రై ఐస్‌ అంటే ఏమిటి? దానిని తిన్న వారు ఎందుకు ఆసుపత్రి పాలయ్యారు?

Advertisment
తాజా కథనాలు