చీరలను పరెఫెక్ట్ గా కట్టుకోవడం ఎలా...

చీరల్లో ఒక ప్రత్యేక అందం ఉంటుంది. ఎలాంటి వారికైనా చీర కట్టుకుంటే అందంతో పాటూ నిండుదనం వస్తుంది. మరి అలాంటి చీరల్ని పర్ఫెక్ట్‌గా ఎలా స్టైలింగ్ చేయాలో, చక్కగా ఎలా కట్టుకోవాలో తెలుసా..

New Update
చీరలను పరెఫెక్ట్ గా కట్టుకోవడం ఎలా...

పట్టు చీర, సిల్క్ చీర, కాటన్ చీర, జార్జెట్ చీర.. అబ్బో చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. మన సాంప్రదాయానికి ముఖ్య సూచిక అయిన చీరల్ని విదేశీయులు సైతం ఇష్టపడతారు.అయితే చీరను ఎలా పడితే అలా కట్టుకుంటే అస్సలు బాగోదు. దీనిని కట్టుకునేందుకు కొన్ని ప్రాపర్ టిప్స్ పాటించాలి. అప్పుడే అవి మంచి లుక్‌లో కనిపించేలా చేస్తాయి.చీరలు కట్టుకోవడం అంత ఈజీ కాదు. కొన్ని టెక్నిక్స్ పాటించాలి.ముందుగా చీరకి సెట్ అయ్యే మ్యాచింగ్ ఇన్నర్స్, జ్యువెలరీ అంతా సెట్ చేసుకోవాలి.తరువాత చీర, దానికి తగ్గ జాకెట్ ఎంచుకోవాలి. చీర నార్మల్‌గా ఉన్నా బ్లౌజ్ ఎంత స్టైలిష్‌, గ్రాండ్‌గా ఉంటే రిచ్ లుక్ వస్తుంది. అలాగే బాడీ సైజ్ కు తగ్గట్టు కూడా చీర కట్టుకోవాలి. లావుగా ఉన్నవారు కాటన్ చీరలను అవాయిడ్ చేస్తే మంచిది. అవి స్టిఫ్ గా ఉండడం వల్ల మరి కొంచెం లావుగా కనిపిస్తారు. సన్నగా ఉన్నవారు సిల్క్, జార్జెట్ చీరలు కట్టుకుంటే మరింత సన్నగా కనిపిస్తారు.

Also Read:నటించలేదు..జీవించాడు..బన్నీకి బిగ్‌ బి ప్రశంసలు!

ఏదైనా ఫంక్షన్‌కి అటెండ్ అయినప్పుడు ముందుగా చీర కట్టుకుని, జ్యువెలరీ సెట్ చేసుకోవాలి. ఆ తర్వాతే మేకప్ చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. అప్పుడే శారీకి పర్ఫెక్ట్ లుక్ తీసుకురావొచ్చు. సాధారణంగా చీర కట్టుకోవడమే కొందరికీ కష్టంగా ఉంటుంది. ఇక ఫంక్షన్స్‌ అయితే సరేసరి. అలా కాకుండా పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు, గృహప్రవేశాలు, ఇలా ఏ ఫంక్షన్స్ అయినా మేకప్ గురించి పిలిపిస్తుంటారు. చీరలు కట్టుకోవడం రానివారు మేకప్ చేసే వారితోనే చీరలు కూడా కట్టించుకోవచ్చును. అలాగే చీరలు కట్టుకున్నప్పుడు పర్ఫెక్ట్ జ్యువెలరీ కూడా వేసుకోవడం కూడా చాలా ముఖ్యం. ప్లెయిన్ చీరలు వేసుకున్నప్పుడు ముత్యాలు, యాంటిక్ జ్యువెలరీ వేసుకోవడం బావుంటుంది. అదే విధంగా పట్టు చీరలు వేసుకున్నప్పుడు గోల్డ్ జ్యువెలరీ లేదా ఇమిటేషన్ గోల్డ్ వేసుకుంటే బావుంటుంది.

చీర కట్టుకున్నప్పుడు తప్పకుండా నడుము కొంత భాగం బయటకు కనిపిస్తుంది. అయితే మనం ఎంత భాగం బయటకు చూపించడానికి ఇష్టపడుతున్నాం అన్నదానిపై ఆధారపడి కూడా చీర ఎంపిక ఉండాలి. షీర్ ఫ్యాబ్రిక్స్, నెట్టెడ్.. వంటివి ఎంచుకున్నప్పుడు చర్మం ఎక్కువగా కనిపిస్తుంటుంది. చర్మం ఎక్కువగా కనిపించకూడదు అనుకుంటే.. వీటి బదులు వేరే ఫ్యాబ్రిక్ ఎంచుకోవాలి. అంతేకాకుండా.. బ్లౌజ్ పొడవు కూడా చూసుకొని కుట్టించుకోవాలి. చీర కట్టుకున్నాక ఎక్కడా ఇబ్బంది లేకుండా సేఫ్టీ పిన్స్ పెట్టుకోండి. కుచ్చిళ్లు పెట్టే ముందు ఒక పిన్ పెట్టండి. ఇలా పెట్టికోట్‌కి చీరకి కలిపి పిన్ పెట్టడం వల్ల.. మీరు కుచ్చిళ్లు దోపిన తర్వాత కూడా అవి కదలకుండా ఉంటాయి. కుచ్చిళ్లు పెట్టాక వాటిని కలుపుతూ ఓ పిన్ పెట్టుకొని అప్పుడు లోపలికి దోపుకోండి. ఆ తర్వాత చీర కొంగు కోసం మరొక పిన్ పెట్టుకోవాలి. ఇంకా మీకు ఎక్కడైనా చీర జారుతుందని అనుమానంగా అనిపిస్తే.. అక్కడ కూడా పిన్ పెట్టుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చీరను హాయిగా క్యారీ చేయవచ్చును.

Advertisment
తాజా కథనాలు