Voter ID : దేశంలో ఎన్నికల(Elections) హడావిడి మొదలైంది. మార్చి నెల మరో రెండు రోజుల్లో ముగుస్తుంది. ఏప్రిల్ 19 నుంచి దేశంలో ఎన్నికల సమరం మొదలు కానుంది. దేశంలో మొత్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. ఎన్నికలు వస్తున్నాయంటే ఎప్పుడో లోపల పెట్టిసిన ఓటర్ ఐడీ ని ఇప్పుడు బయటకు తీసే టైమ్ వచ్చింది.
ఎన్నికల రోజు ఓటు వేయడానికి వెళ్లే సమయంలో ఓటర్ ఐడీ(Voter ID) కనిపించక.. చాలా మంది కంగారు పడుతుంటారు. అయితే ఓటర్ ఐడీ లేకపోయినా ఓటు వేయోచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఓటరు లిస్టులో పేరుండి ఓటర్ ఐడీ లేకపోయినా ఓటు వేయోచ్చని ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది.
ఓటు వేయాల్సిన సమయంలో పోలింగ్ కేంద్రంలో ఓటరు ఐడీ ని అధికారులుకు చూపించాల్సి ఉంటుంది. లేకపోతే ఎలక్షన్ కమిషన్(Election Commission) తెలిపిన 12 ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి ఉంటే చాలు ఓటు వేసేయోచ్చు అని పేర్కొంది. ఆ 12 కార్డులు ఏంటంటే...
ఆధార్ కార్డు... దేశంలో ఎక్కడికి వెళ్లినా ఈ ఒక్క కార్డు ఉంటే చాలని కేంద్రం ఎప్పుడో ప్రకటించింది. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఓటర్ ఐడీ లేకపోతే ఈ కార్డును చూపించి ఓటు వేయోచ్చని ఈసీ పేర్కొంది.
డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఉపాధి హామీ కార్డు, పాస్ పోర్టు, బ్యాంక్ కానీ, పోస్టాఫీస్ కానీ ఫోటోతో ఉన్న పాస్ బుక్, ఎన్‌పీఆర్ స్మార్ట్ కార్డు, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, ఫోటో ఉన్న పెన్షన్ డాక్యుమెంట్, ప్రభుత్వ ఉద్యోగులు(Government Jobs) అయితే సర్వీస్ ఐడీ కార్డులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయితే అధికార గుర్తింపు కార్డులు, దివ్యాంగులు అయితే వారికి జారీ చేసిన ఐడీ కార్డుల్లో ఏదోకటి చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఎలక్షన్ కమిషన్ తెలిపింది.
వీరిలో ప్రవాసా భారతీయులు ఉంటే కనుక ఒరిజినల్ పాస్ పోర్టును పోలింగ్ సిబ్బందికి చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.
Also Read : ఒక్క బెంగళూరు మాత్రమే కాదు.. హైదరాబాద్ కూడా ఆ లిస్ట్ లో !