Dogs Are Old Age : కుక్కలు(Dogs) మనిషికి మంచి స్నేహితులు అని అంటుంటారు. వాసన(Smell) ను బట్టే కుక్కలను మనల్ని ఈజీగా గుర్తిస్తాయి. కానీ మన పెంపుడు కుక్కల్లో వచ్చే ఆరోగ్య మార్పుల(Health Changes) ను మాత్రం మనం గుర్తించలేకపోతున్నాం. కుక్కలకు వృద్ధాప్యం వచ్చిందని అసలు ఎలా గుర్తించాలి. ఈ లక్షణాలతో సులభంగా గుర్తించవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. కుక్కల వృద్ధాప్యంపై కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కుక్కల జీవితకాలం:
- సరైన సమయంలో కుక్కల ఆరోగ్యం(Dogs Health) పట్ల జాగ్రత్తలు తీసుకోకపోతే అవి వృద్ధాప్యం బారినపడి చనిపోయే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. కొందరు యజమానులు వారి పెంపుడు కుక్కల ఆరోగ్యాన్ని అస్సలు పట్టించుకోరు. నిజానికి కుక్కల జీవిత కాలం మనుషుల కంటే చాలా తక్కువ. వివిధ జాతుల కుక్కలు 7 నుంచి 10 సంవత్సరాల వరకే జీవిస్తాయి. అంతేకాకుండా ఆ వయసులో శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కొంటాయి. కుక్కల యజమానులు దీనిని అర్థం చేసుకునే సమయానికి పరిస్థితి చేయిదాటి పోతుంది.
కుక్క వయస్సును ఎలా గుర్తించాలి?
- కుక్కల వయస్సు పెరుగుతుందని అర్థం చేసుకోవడానికి శారీరక శక్తి అని అంటున్నారు. మీ కుక్క మెట్లు ఎక్కలేకపోవడం, దూకడం వంటివి చేయకపోవడం చేస్తుంటే వృద్ధాప్యం వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. శారీరక శ్రమ లేకపోవడం వల్ల వాటి బరువు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వాటి నిద్ర విధానంలో కూడా మార్పులు గమనించవచ్చు.
ప్రవర్తనలో మార్పు:
- కుక్క పెద్దయ్యాక దాని తల, ముక్కు భాగంలో తెల్లటి మచ్చలు కనిపించడం ప్రారంభిస్తాయి. అంతే కాకుండా చూసే శక్తి, వినే శక్తి కూడా తగ్గుతుంది. అంతకముందులాగా గట్టిగా అరవలేకపోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఆహారపు అలవాట్లు:
- వయసు పెరుగుతున్న కొద్దీ కుక్కల ఆహారపు అలవాట్లు కూడా మారుతాయి. ఆహారం కూడా తక్కువగా తీసుకుంటాయి. అంతేకాకుండా ఆహారాన్ని మెల్లగా తీసుకుంటాయి. అలాంటి పరిస్థితిలో పశువైద్యుని దగ్గరకు తీసుకెళ్లి వారు సూచించిన ప్రత్యేక ఆహారాన్ని వాటికి అందించాలి. ఆ సమయంలో దానికి తగినంతగా ప్రోటీన్, ఫైబర్ అవసరం. కానీ సాధారణ ఆహారాన్ని అవి జీర్ణం చేసుకోలేవని వైద్యులు(Doctors) చెబుతున్నారు. కుక్కల కోసం ప్రత్యేకంగా మార్కెట్‌లో కొన్ని ప్రొటీన్లు కలిగిన ఆహారాలు అందుబాటులో ఉన్నాయి.
ఇది కూడా చదవండి : మెదడులోని నరాలు పగిలితే ఏమవుతుంది?.. అలా జరగడానికి కారణాలేంటి?
గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.