Pomegranate Juice : ఎర్రటి గింజలు ఉన్న దానిమ్మను ఎలా గుర్తించాలి?

దానిమ్మ ఆకారాన్ని చూడాలి. పండిన దానిమ్మపండును ఎంచుకున్నప్పుడు అది షట్కోణ ఆకారంలో ఉండాలి. దీనిలో అంచులు స్పష్టంగా కనిపిస్తాయి. పండనిది మృదువుగా, గుండ్రంగా ఉంటుంది. దీనిలో ఎటువంటి అంచులు స్పష్టంగా కనిపించవు.

New Update
Pomegranate Juice : ఎర్రటి గింజలు ఉన్న దానిమ్మను ఎలా గుర్తించాలి?

How To Define Pomegranate Juice : వ్యాయామానికి(Exercise) ముందు దానిమ్మ రసం(Pomegranate Juice) తాగడం వల్ల కండరాలలో ఆక్సిజన్ స్థాయిలు(Oxygen Levels) పెరిగి అలసట తగ్గుతుంది. పండ్ల కొనుగోళ్లకు వెళ్లినప్పుడు మనలో చాలా మందికి పండు పండిందో లేదో తెలియదు. పండిన పండ్లు మంచి రుచిని కలిగి ఉంటాయి. దానిమ్మ పండును కొనేటప్పుడు అది పండిందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే పండిన దానిమ్మపండు మాత్రమే రుచిగా ఉంటుంది.

దానిమ్మ ఎందుకు తినాలి..?

వేసవి(Summer) లో దానిమ్మపండు తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇందులో పోషకాలు, విటమిన్లు సి, ఇ, కె(Vitamin C, E , K) అలాగే ఫోలేట్, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. దానిమ్మ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. వాపును కూడా తగ్గిస్తుంది, కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. దానిమ్మ రసం రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ధమనులలో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడతుంది. దానిమ్మపండులోని పీచు జీర్ణక్రియను తగ్గించడంలో సహాయపడుతుంది. కొన్ని పరిశోధనల్లో దానిమ్మలు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయని చెబుతుఉన్నాయి. దానిమ్మ రసం తీసుకోవడం ప్రోస్టేట్ క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గిస్తుందని అంటున్నారు.

సరిగ్గా పండిన దానిమ్మను ఎలా గుర్తించాలి..?

దానిమ్మ ఆకారాన్ని చూడాలి. పండిన దానిమ్మపండును ఎంచుకున్నప్పుడు అది షట్కోణ ఆకారంలో ఉండాలి. దీనిలో అంచులు స్పష్టంగా కనిపిస్తాయి. పండనిది మృదువుగా, గుండ్రంగా ఉంటుంది. దీనిలో ఎటువంటి అంచులు స్పష్టంగా కనిపించవు. అంతేకాకుండా దానిమ్మపండు బరువును చూడాలి. దానిమ్మపండులో అన్ని జ్యుసి గింజలు ఉంటే అది బరువుగా ఉంటుంది. లేకపోతే అది పండినది కాదని అంటున్నారు. ఒక దానిమ్మ దాని పరిమాణానికి సరిపడా బరువు ఉంటే అందులో గింజలు ఎర్రగా ఉంటాయి. దానిమ్మపండును నొక్కినప్పుడు అది గింజలతో నిండి ఉంటే శబ్ధం రాదు, తక్కువ విత్తనాలు ఉంటే డొల్ల శబ్ధం వస్తుందని గుర్తుంచుకోవాలి.

ఇది కూడా చదవండి : శరీరంపై దద్దుర్లు ఈ వ్యాధి లక్షణమేనా?..ఎందుకొస్తుందో తెలుసా?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు