Family Tips: అత్తమామలతో తగాదాలను పరిష్కరించుకోవడం ఎలా.. ఇలా నడుచుకోండి

అత్తగారు లేదా మామగారితో మంచిగా ప్రవర్తిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అత్తమామలతో విభేదాలు వచ్చినా మీ భర్తతో మాత్రం సంబంధం చెడిపోకుండా చూసుకోవాలి. కోడలి గురించి ఇతరుల ముందు హీనంగా మాట్లాడేవారికి, చెడుగా మాట్లాడే వ్యక్తుల నుంచి దూరంగా ఉంటే మంచిది.

New Update
Family Tips: అత్తమామలతో తగాదాలను పరిష్కరించుకోవడం ఎలా.. ఇలా నడుచుకోండి

Family Tips: పెళ్లి తర్వాత ప్రతి అమ్మాయి అత్తవారింట్లో కొత్త కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఇంట్లోని వారితో మంచిగా ఉండాలని పెద్దలు చెబుతున్నారు. అత్తగారు లేదా మామగారితో మంచిగా ప్రవర్తిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ కొన్ని సందర్భాల్లో అభిప్రాయ బేధాలు రావొచ్చు. ఉద్యోగం విషయంలో లేదా వస్త్రధారణ విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాంటి విషయంలో కాస్త జాగ్రత్తగా నడుచుకోవాలి. ఎవరి సలహాలు తీసుకున్నా మీ భవిష్యత్‌ నాశనమైపోతుందని పెద్దలు అంటున్నారు.

చెడుగా మాట్లాడే వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి:

  • ఒకవేళ మీ అత్తమామలతో విభేదాలు వచ్చినా మీ భర్తతో మాత్రం సంబంధం చెడిపోకుండా చూసుకోవాలి. దీని వల్ల మీ సంసార జీవితంలో చిలుక రాదని నిపుణులు అంటున్నారు. మీ అత్తమామలు మీతో వ్యవహరిస్తున్న తీరును భర్తతో పంచుకోవాలి. ఒక వేళ భర్త మీతో ఏకీభవించకపోతే అతనితో గొడవ పెట్టుకోకుండా అర్థమయ్యేలా చెప్పాలి. దాంతో ఆయన వాళ్ల తల్లిదండ్రులతో మాట్లాడి గొడవను సర్దుమణిగేలా చేస్తాడు. కోడలి గురించి ఇతరుల ముందు హీనంగా మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు. మీకు కూడా ఇలాగే జరుగుతుంటే దానికి స్పందించకండి. మీ గురించి చెడుగా మాట్లాడే వ్యక్తుల నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి.

నవ్వుతూ సరైన సమాధానం చెప్పాలి:

  • మీ అత్తమామలు మీ ఇంటి పేరును ఎగతాళి చేస్తే అలాంటి పరిస్థితిలో బాధపడకండి. బదులుగా నవ్వుతూ వారికి సరైన సమాధానం ఇవ్వండి. ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు చెడు వాతావరణం కూడా మెరుగుపడుతుంది. ఒక్కోసారి ఇతరుల ముందు కోడలు గురించి చెడుగా మాట్లాడటం వల్ల కోడళ్లు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఇలా మీకూ జరిగితే బాధపడకుండా సంయమనంతో వ్యవహరించాలి. మీ కుటుంబ సభ్యులకు లేదా భర్తకు బాధ కలిగించే ఎలాంటి విషయాలు చెప్పకూడదు. ఎందుకంటే గొడవలు పెద్దగా మారుతాయని పెద్దలు అంటున్నారు.

ఇది కూడా చదవండి : ముక్కు కారుతుందా? తుమ్ములు వస్తున్నాయా? ఎందుకో తెలుసుకోండి!

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు