Health : ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారా? ఈ చిన్న చిట్కాతో ఇక నో టెన్షన్!

ఒత్తిడి సమస్యతో బాధపడేవారు కెఫీన్, చక్కెరను పరిమితం చేయడం ముఖ్యం. వ్యాయమానికి సమయం కేటాయించండంతో పాటు డీప్ బ్రీతింగ్, మెడిటేషన్ ఒత్తిడి నుంచి రిలీఫ్‌ వచ్చేలా చేస్తాయి. మీలో మీరు మాట్లాడుకోండి. అదికూడా మంచి విషయాలపై దృష్టి పెట్టండి. మనల్ని హ్యాపీగా ఉంచే వాటిని థింక్‌ చేయండి.

New Update
Health : ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారా? ఈ చిన్న చిట్కాతో ఇక నో టెన్షన్!

How To Reduce Stress : ఆఫీస్‌లో ఒత్తిడి(Stress), చదువులో ఒత్తిడి, ఆటల్లో ఒత్తిడి, రిలేషన్‌షిప్‌(Relationship) లో ఒత్తిడి.. ఇలా దాదాపు ప్రతీ మనిషి ఏదో ఒక విషయంలో ఒత్తిడిని ఫేస్ చేస్తున్నారు. చాలా సార్లు ఇది భరించలేనిదిగా ఉంటుంది. నైట్ నిద్ర పట్టదు. నిజానికి ఒత్తిడి కూడా సర్వసాధారణంగా మారిపోయిన రోజులివి. అయితే ఒత్తిడిని లైట్ తీసుకోవద్దు.. తీవ్రమైన ఒత్తిడి అనేక ఆరోగ్య సమస్య(Health Problems) లకు కారణం అవుతుంది. అది పరోక్షంగా లేదా ప్రత్యేక్షంగా కావొచ్చు. ఒత్తిడిని జయించడానికి కొన్ని టిప్స్ ఉంటాయి.

Stress Feeling ప్రతీకాత్మక చిత్రం (Image Credit/Unsplash)

డీప్ బ్రీతింగ్: ఒత్తిడిగా అనిపించినప్పుడు లోతుగా శ్వాస(Deep Breathing) పీల్చండి. తర్వాత స్లోగా బ్రీత్‌ని వదలండి.

మెడిటేషన్: మైండ్‌లోనే మెడిటేషన్‌(Meditation) చేసుకోవచ్చు. మీ శ్వాసపై దృష్టి పెట్టండి. లేకపోతే కాసేపు చుట్టు ఉన్న పరిసరాలను పరిశీలించండి.

పాజిటివ్ సెల్ఫ్ టాక్: మీలో మీరు మాట్లాడుకోండి. అదికూడా మంచి విషయాలపై దృష్టి పెట్టండి. మనల్ని హ్యాపీగా ఉంచే వాటిని థింక్‌ చేయండి.

సమస్యను పార్ట్స్‌గా డివైడ్ చేయండి. ఏ సమస్యనైనా విభజించవచ్చు. ఒక సమయంలో ఒక్కొక స్టెప్‌ను పరిష్కరించుకోవచ్చు.

సమయ నిర్వహణ: ఆఫీస్‌ పనులతో పాటు పర్శనల్‌ లైఫ్‌కూ ప్రాధాన్యత ఇవ్వండి. సమయాన్ని సమర్థవంతంగా కేటాయించండి. ఇది టెన్షన్‌ను తగ్గిస్తుంది.

వ్యాయమానికి సమయం కేటాయించండి. మెల్లిగా నడవండి. మైండ్‌ను కూల్‌గా ఉంచండి. శారీరక కార్యకలాపాలలో పాల్గొనండి. వ్యాయామం ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

విజువలైజేషన్: ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్‌. మనకు నచ్చిన ప్రదేశాన్ని ఊహించుకోండి. మంచి విషయాలను కూడా విజువలైజ్ చేసుకోండి. మీకు ఏది ప్రశాంతతను ఇస్తే వాటిని ఊహించుకోండి. విజువలైజేషన్ ఆందోళన, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

మద్దతు కోరండి: మీకు నచ్చినవారితో, మీరు నమ్మే వారితో మీరు ఫేస్‌ చేస్తున్న ఒత్తిడి గురించి డిస్కస్ చేయండి. మీ మనసులో మాటలు షేర్ చేయండి. మీ ఆందోళనలను పంచుకోవడం మంచిది. అప్పుడు మీరు ఎమోషనల్‌గా రిలీఫ్‌ పొందుతారు. కొన్నిసార్లు విలువైన సలహాలు కూడా ఇస్తారు.

కెఫీన్, చక్కెరను పరిమితం చేయండి. ఈ పదార్థాలు ఆందోళన భావాలను పెంచుతాయి. ప్రశాంతంగా ఉండటాన్ని కష్టతరం చేస్తాయి. మంచినీటితో పాటు సమతుల్య ఆహారాన్ని ఎంచుకోండి.

DISCLAIMER :ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. RTV దీనిని ధృవీకరించలేదు. ఆరోగ్య సమస్యలకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం అవసరం.

Also Read: నిద్ర విషయంలో ఈ తప్పు చేస్తున్నారా? అయితే గుండె సమస్యలు తప్పవు!

Advertisment
తాజా కథనాలు