Tandoori Chicken: తందూరీ చికెన్ అంటే మాంసాహార ప్రియులకు పండగే. కానీ ఎక్కువగా బయట దొరికే తందూరీ చికెన్ కొని తెచ్చుకుని రోగాలను సైతం కొని తెచ్చుకుంటుంటారు. ఇంట్లోనే చేసుకోవాలని ఉన్నా ఎలాగో తెలియక తప్పనిసరి పరిస్థితుల్లో రెస్టారెంట్లకు పరుగులు పెట్టక తప్పడం లేదు. అయితే ఈ చిట్కాలతో ఇంట్లోనే సులభంగా తందూరీ చికెన్ తయారు చేసుకోవచ్చు. అందులో కాస్త కొత్తమీర చట్నీ జోడిస్తే అద్భుతంగా ఉంటుంది. తందూరీ చికెన్ రిసిపి ఒక క్లాసిక్ స్టార్టర్ రెసిపీ. తందూరి చికెన్ చేయడానికి ముందుగా తాజా తందూరి మసాలా తయారు చేస్తారు. అంతేకాకుండా కాస్త నూనె వేసి వండుతారు.
తందూరీ చికెన్‌కు కావాల్సిన పదార్థాలు:
- 2 ముక్కలు చికెన్ బ్రెస్ట్, 2 లెగ్ పీస్‌లు తీసుకుని బాగా కడగాలి. మెరినేషన్ కోసం ఎండు మిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా, తందూరీ మసాలా, నూనె, 3 కప్పుల పెరుగు, నిమ్మరసం తీసుకోవాలి. తందూరి మసాలా చేయడానికి 2 దాల్చిన చెక్కలు, నల్ల మిరియాలు, 5 పచ్చి యాలకులు, 3 నల్ల యాలకులు, కొత్తిమీర, జీలకర్ర, 3 లవంగాలు, 1 బే ఆకు, పసుపు తీసుకోవాలి.
తందూరీ చికెన్ తయారీ:
- ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్, రెడ్ మిర్చి పేస్ట్, తందూరీ మసాలా, నూనె, పెరుగు, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. తర్వాత అందులో చికెన్ ముక్కలను మెరినేషన్ కోసం వేయాలి. చికెన్ ముక్కలపై చిన్నగా కట్ చేయాలి. చికెన్ ముక్కలను 30 నిమిషాలు మ్యారినేట్ చేసి ఆపై చికెన్ ముక్కలను గ్రిల్లర్ లేదా తాందూర్‌లో ఉంచి గ్రిల్ చేయాలి. అప్పుడప్పుడు తిప్పుతూ ఉంచాలి. తర్వాత ఉల్లిపాయ, నిమ్మరసంతో సర్వ్ చేయాలి.
తందూరీ మసాలా ఇలా చేయండి:
- దాల్చినచెక్క, ఎండుమిర్చి, పచ్చి యాలకులు, నల్ల యాలకులు, కొత్తిమీర, జీలకర్ర, లవంగాలు, బే ఆకులు , పసుపును ఒక బాణలిలో వేయించాలి. ఈ మసాలాను మిక్సీలో వేసి మేత్తగా పట్టుకోవాలి.
ఇది కూడా చదవండి: మధుమేహం ఉన్నవారు ఏం ఆహారం తీసుకుంటే మంచిది..?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.