Break Fast : ఓట్స్(Oats) రుచికరంగా ఉండటమే కాదు..ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇందులో పోషకాలు మెండుగా ఉన్నాయి. మీ బరువును తగ్గించుకునే(Weight Loss) ఆహారంలో ఓట్స్ చీలా(Oats Chilla)ను చేర్చుకోవచ్చు. ఇదివేగంగా బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు ఓట్స్ చీలాను శనగపిండి, జీలకర్ర, అజ్వైన్, పసుపు, కారం, క్యారెట్, కొత్తిమీర, ఓట్స్ నుఉపయోగించి తయారు చేసుకోవచ్చు. ఈ ఓట్స్ చీలా చాలా రుచికరంగా ఉంటుంది. ఓట్స్ చీలాను ఉదయం బ్రేక్ ఫాస్టులో చేర్చుకోవచ్చు. ఈ రెసీపీ(Recipe) ని కేవలం 20 నిమిషాల్లోనే తయారు చేయవచ్చు.
ఓట్స్ చీలాకు కావాల్సిన పదార్ధాలు:
ఓట్స్ - అరకప్పు
శనగపిండి- 3కప్పులు
క్యారెట్- పావు కప్పు ( తురిమినది)
టమోటాలు - పావు కప్పు సన్నగా తరిగినది
ఉల్లిపాయ - 1సన్నగా తరిగినది
పచ్చిమిర్చి - 1 సన్నగ తరిగినది
అల్లం - 1 స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నీరు- 1 కప్పు
తయారీ విధానం:
ముందుగా ఓట్స్‌ను గ్రైండర్‌లో మెత్తగా రుబ్బుకోవాలి .ఇప్పుడు గ్రైండ్ చేసిన ఓట్స్‌లో శెనగపిండి , పసుపు , జీలకర్ర , కారం, ఇతర మసాలా దినుసులు వేసి బాగా కలపాలి .దీని తరువాత , ఈ పేస్ట్‌లో క్యారెట్ , టొమాటో , క్యాప్సికమ్ , అరకప్పు సన్నగా తరిగిన కొత్తిమీర వంటి అన్ని సన్నగా తరిగిన కూరగాయలను జోడించండి.ఇప్పుడు మీరు మీ అవసరాన్ని బట్టి ఈ పేస్ట్‌కి నీటిని జోడించవచ్చు . ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేడి పాన్ మీద పోసి నూనె రాసి రెండు వైపులా కాల్చుకోవాలి. అచ్చం దోశమాదిరి. అంతే సింపుల్ ఓట్స్ చీలా రెసీపీ రెడీ.