బాడీలో కొలెస్ట్రాల్ తగ్గితే బరువు ఈజీగా తగ్గుతారు. ఈపనిని నిమ్మరసం బాగా పనిచేస్తుంది. బరువు తగ్గాలంటే తక్కువ కేలరీలు తీసుకోవడం ఒక్కటే సరిపోదు. ముందుగా బాడీలోని ట్యాక్సిన్స్‌ని పోయేలా చూడాలి. దీనికి నిమ్మరసం బాగా పనిచేస్తుంది. ఈ ట్యాక్సిన్స్‌ని బయటికి పంపడంలో నిమ్మరసం బాగా పనిచేస్తుంది. దీనిని పద్నాలుగు రోజుల చొప్పున చేయాలి. వరుసగా పద్నాలుగు రోజులు తీసుకున్న తర్వాత 10 రోజులు బ్రేక్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేయాలి. కానీ మొదటి 14 రోజులకే శరీరంలో మార్పు కనిపిస్తుందని చెబుతున్నారు నిపుణులు.
Also Read:మరీ ఇంత గర్వం పనికిరాదు కంగారూలూ..
మొదటి రెండు రోజులు..
మొదటిరోజు ఓ కప్పు నీటిలో నిమ్మరసం పిండి తాగాలి. రెండో రోజు రెండు నిమ్మకాయలను రెండు కప్పుల నీటితో కలిపి తాగాలి. ఇవన్నీ కూడా బ్రేక్‌ఫాస్ట్‌కి ముందు తాగాలి. అవసరమనుకుంటే కొద్దిగా తేనె కలుపుకోవచ్చును.
3, 4 రోజులు..
మూడో రోజు మూడుకప్పుల నీటిలో మూడు నిమ్మకాయల రసాన్ని కలిపి తాగాలి. అవసరమనుకుంటే తేనె కలపండి. దీన్ని రోజుకి రెండు సార్లు తాగాలి. నాల్గవరోజు.. నాలుగు నిమ్మకాయల్ని పిండి నాలుగు కప్పుల నీటిని కొంచెం తేనె కలపి భోజనానికి ముందు తాగాలి. రోజుకు రెండు సార్లు ఉదయం , రాత్రి పడుకునే ముందు తాగాలి.
5,6 రోజులు
ఈ రోజుల్లో ఐదు నిమ్మకాయల రసాన్ని ఐదు కప్పుల నీరు, తేనెతో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. 6వ రోజు ఆరు నిమ్మకాయల రసాన్ని ఆరుకప్పుల నీటిలో కలిపి ఓ టీస్పూన్ తేనె కలిపి మూడు సార్లు తాగాలి.
7,8 రోజులు..
ఏడో రోజు 3 నిమ్మకాయల్ని పది కప్పుల నీటిలో కలిపి మూడుసార్లు భోజనానికి ముందు తాగాలి. ఎనిమిదో రోజు కూడా ఆరు నిమ్మకాయల రసాన్ని ఆరు కప్పుల నీటిలో కలిపి చెంచా తేనె కలిపి తాగాలి.
9,10 రోజులు..
తొమ్మిదో రోజు ఐదు నిమ్మకాయల రసాన్ని ఐదు కప్పుల నీటిలో వేసి ఓ టేబుల్స్పూన్ తేనె వేసి తాగాలి. పదో రోజు 4 నిమ్మకాయల్ని 4 కప్పుల నీటిలో రసాన్ని పిండి తేనె కలిపి తాగాలి.
ఇక 11వ రోజు 3 నిమ్మకాయలు, 3 కప్పుల నీటిలో కలిపి రెండుసార్లు తాగాలి. 12వ రోజు రెండు నిమ్మకాయల 2 కప్పుల నీటిలో కలిపి బ్రేక్‌ఫాస్ట్ ముందు తాగాలి. 13 వ రోజు 3నిమ్మకాయల రసాన్ని 10 కప్పుల నీటిలో కలిపి తేనె కలిపి తాగాలి. అవసరమనుకుంటే చిటికెడు జీలకర్ర పొడి, ఉప్పు కలిపి తాగండి. 14 వ రోజు కూడా దీనినే రిపీట్ చేయాలి. ఇలా చేయడం వల్ల చాలా వరకూ రిజల్ట్ ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అయితే ఏం చేసినా మన శరీరంలో జరిగే మార్పులను గమనించుకుంటూ చేయాలి. లేదా నినుణుల సలహాలు తీసుకుని చేయడం మంచిది. ఏ మాత్రం తేడా వచ్చినా వెంటనే ఆపేసి డాక్టర్ ని సంప్రదించాలి.