Child Care: 6 నెలల లోపు పిల్లల శరీరం చల్లగా మారితే కంగారు పడొద్దు..ఇలా చేయండి

పిల్లల శరీర ఉష్ణోగ్రత తగ్గడం వల్ల అనారోగ్యానికి గురవుతారు. నవజాత శిశువులకు ఏదైనా అనారోగ్యం వస్తే కంగారు పడకుండా ప్రతి 2 -3 గంటలకు తప్పనిసరిగా పిల్లవాడికి తల్లిపాలు ఇవ్వాలి. శిశువు కడుపు నిండుగా ఉండి.. శరీరం కూడా తగిన ఉష్ణోగ్రతలో ఉంటారు.

New Update
Child Care: 6 నెలల లోపు పిల్లల శరీరం చల్లగా మారితే కంగారు పడొద్దు..ఇలా చేయండి

Child Care: మీ ఇంట్లో కూడా నవజాత శిశువులు ఉన్నారా, వారికి ఏదైనా అనారోగ్యం వస్తే కంగారు పడకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. ఈ రోజుల్లో చాలా రాష్ట్రాల్లో వాతావరణం చల్లగా ఉంటుంది. కొన్ని చోట్ల ఉష్ణోగ్రత ఒకటి లేదా రెండు డిగ్రీల సెల్సియస్‌కు కూడా చేరుకుంది. అలాంటి పరిస్థితిలో నవజాత శిశువులు, వృద్ధులకు ఎక్కువగా జలుబు చేస్తుంటుంది. మీ ఇంట్లో 6 నెలలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న చిన్న పిల్లలు ఉంటే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. శీతాకాలంలో 6 నెలల వరకు పిల్లలను ఎలా వెచ్చగా ఉంచవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

శీతాకాలంలో పిల్లల సంరక్షణ ఎలా?:

  • సాధారణంగా శరీరం ఉష్ణోగ్రత 36 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. అదే నవజాత శిశువులకు అయితే ఉష్ణోగ్రత త్వరగా తగ్గుతుంది. పిల్లల శరీర ఉష్ణోగ్రత తగ్గడం వల్ల, వారు అనారోగ్యానికి గురవుతారు. అంతేకాకుండా తల, కాళ్లు, చేతులు, అరికాళ్లు త్వరగా చల్లగా మారుతుంటాయి.

కంగారు పడకండి:

  • పిల్లల శరీర ఉష్ణోగ్రత తగ్గితే కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు అంటున్నారు. తల్లులు ఆ పిల్లలను దగ్గరికి తీసుకోవడం వల్ల వెచ్చగా ఉంటుందని, అంతేకాకుండా మీ గుండెలకు హత్తుకోవడం వల్ల వారి శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరుతుందని చెబుతున్నారు.

ఆవాల నూనెతో మసాజ్ చేయండి:

  • చలికాలంలో పిల్లల శరీర ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయడానికి ఆవనూనెతో అరికాళ్లు, అరచేతులు, ఛాతీ, తలపై మసాజ్ చేయాలని వైద్యులు అంటున్నారు. మస్టర్డ్ ఆయిల్ శరీరాన్ని వేడిగా ఉంచుతుందని చెబుతున్నారు.

ప్రతి 2 నుంచి 3 గంటలకు తల్లిపాలు ఇవ్వండి:

  • ప్రతి 2 నుంచి 3 గంటలకు తప్పనిసరిగా పిల్లవాడికి తల్లిపాలు ఇవ్వాలని చెబుతున్నారు. దీంతో శిశువు కడుపు నిండుగా ఉండటమే కాకుండా శరీరం కూడా తగిన ఉష్ణోగ్రతలో ఉంటుందని అంటున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే తల్లిపాలు ఇస్తున్నప్పుడు పిల్లలను బట్టలతో సరిగ్గా కప్పాలని సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: రాగుల్లో బెల్లం కలిపి తింటే ఏం జరుగుతుంది?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు