Parenting Tips: చలికాలంలో పిల్లలు, వృద్ధుల రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీని కారణంగా పిల్లలు తరచుగా అనారోగ్యానికి గురవుతారు. మారుతున్న వాతావరణం ఇద్దరి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితిలో, పిల్లల ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తప్పనిసరిగా చేర్చాలి. పిల్లల్లో రోగ నిరోధక శక్తి బలంగా ఉంటే త్వరగా అనారోగ్యం బారిన పడరు.
దీంతో పిల్లల ఎదుగుదల కూడా మెరుగవుతుంది. పెరుగుతున్న పిల్లలకు పౌష్టికాహారం అందించడం చాలా ముఖ్యం. పిల్లల ఆహారంలో తప్పనిసరిగా చేర్చాల్సిన ఆహార పదార్థాలు గురించి తెలుసుకుందాం.
పిల్లలకు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం
పాలకూర- (Spinach)
పాలకూరలో పిల్లల ఎదుగుదలకు అవసరమైన అనేక రకాల పోషకాలు ఉన్నాయి. విటమిన్ సి, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు, ఐరన్, కెరోటినాయిడ్స్ వంటి పోషకాలు పాలకూరలో లభిస్తాయి. ఇది పిల్లల రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. పాలకూర తినడం వల్ల శరీరంలోని ఐరన్ లోపం తీరుతుంది. తప్పనిసరిగా కూరగాయలు, సలాడ్ రూపంలో పిల్లలకు పాలకూరను తినిపించాలి.
బ్రోకలీ-(Brokali)
బ్రోకలీ పిల్లలకు చాలా మంచిది. బ్రోకలీలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి, ఇది పిల్లల అభివృద్ధికి సహాయపడుతుంది. బ్రోకలీ తినడం ద్వారా, శరీరానికి విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఇతర విటమిన్లు అందుతాయి. దీని కారణంగా రోగనిరోధక శక్తి బలపడుతుంది. బ్రోకలీని పిల్లలకు తప్పకుండా తినిపించండి.
చిలగడదుంప-(Sweetpotato)
పిల్లలు చిలగడదుంప రుచిని ఇష్టపడతారు. చిలగడదుంప తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కళ్లకు మేలు చేసే చిలగడదుంపలలో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఎ లోపాన్ని చిలగడదుంప తినడం ద్వారా భర్తీ చేయవచ్చు. ఇందులో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
అల్లం-వెల్లుల్లి-(Ginger-garlic)
ఆహారంలో అల్లం-వెల్లుల్లిని తప్పకుండా చేర్చండి. ఇది శరీరానికి అవసరమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను అందిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అల్లం వెల్లుల్లి తింటే జలుబు, దగ్గు సమస్య దరిచేరదు. ఈ రెండు అంశాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
పసుపు-(Termeric)
పసుపును కూరగాయలలో ఉపయోగిస్తారు, కానీ పిల్లలకు పసుపు పాలు కూడా ఇవ్వాలి. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే పసుపులో ఇలాంటి అనేక లక్షణాలు ఉన్నాయి.
ఈ ఆహార పదార్థాలను పిల్లలకు ఆహారంలో చేర్చడం ద్వారా వారిలో రోగనిరోధక శక్తి పెరిగి ఐరన్ లా స్ట్రాంగ్ గా ఉంటారు.
Also read: మేము దాదాగిరి చేస్తే తట్టుకోలేరు..అప్పుడు కాళ్లు మొక్కి..ఇప్పుడు విమర్శలా?