Mango : మామిడి పళ్లు సహజంగా పండినవి.. కృతిమంగా పండినవి ఎలానో గుర్తించండి!

కృత్రిమంగా పండించిన మామిడిలో చాలా తక్కువ  రసం ఉంటుంది. అయితే ఆర్గానిక్ మామిడిలో చాలా 'సహజ రసం' ఉంటుంది. కృత్రిమంగా పండిన మామిడిలో, చర్మం దగ్గర ఉన్న తొడెం రంగు, లోపల ఉన్న దానికి భిన్నంగా ఉంటుంది., కానీ సహజంగా పండిన మామిడి మొత్తం పసుపు రంగులో ఉంటుంది.

Health Tips : మామిడి పండు తినే అరగంట ముందు ఇలా చేయండి..లేకపోతే చాలా ప్రమాదం!
New Update

Mango's Without Adulteration : వేసవి కాలం(Summer) వచ్చేసింది... పండ్లకు రారాజు అయినటువంటి మామిడి పళ్లు(Mango)  మార్కెట్లో కనపడతున్నాయి. మంచిగా నోరూరిస్తూ పసుపు రంగులో రండి రండి అంటూ పిలుస్తున్నాయి. ఇంకేముంది ఆ వాసనకు , ఆ రంగులకు ఎంత ధరైనా పెట్టి మామిడి కాయలను కొని ఇంటికి తీసుకుని వచ్చిన తరువాత అవి పాడైపోయి... కుళ్లిపోయినట్లు తెలిస్తే.. ఇక అంతే సంగతులు.

అంతేకాకుండా.. పండు కృతిమ రసాయనాలను(Synthetic Chemicals) ఉపయోగించి పండించినవి అయితే అవి అంతగా తీపి అనిపించవు.. అంతేకాకుండా వాటిని తినడం వల్ల కొత్త రోగాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందుకే కొనేటప్పుడే మంచి కాయలను ఎంచుకొని ఇంటికి తెచ్చుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

మామిడి పండ్లను కృతిమ పద్దతిలో పండించడానికి ఉపయోగించే కాల్షియం కార్బైడ్‌ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే దీనిని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(Food Safety & Standards Authority Of India)  ఎప్పుడో నిషేధించింది. మామిడి పండ్లను కృత్రిమంగా పండించే ప్రక్రియలో తరచుగా ఎసిటిలీన్ వాయువు విడుదలవుతుందని తెలుస్తుంది. కాల్షియం కార్బైడ్ వినియోగదారులకు ప్రమాదకరంగా మారుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

అసలు సహజంగా పండిన మామిడి పండు ఎలా ఉండాలి అంటే... “ మామిడి పండు అండాకారంగా, బీన్ ఆకారంలో ఉండాలి. ముఖ్యంగా కాండం చుట్టూ వాసన చూసినప్పుడు తీపి వాసనను అనుభవించాలి. రసాయనికంగా పండిన మామిడిపండ్లు ఉపరితలంపై పసుపు , ఆకుపచ్చ మచ్చలను కలిగి ఉంటాయి, అయితే సహజంగా పండిన మామిడి ఆకుపచ్చ, పసుపు ఏకరీతి మిశ్రమాన్ని కలిగి ఉంటుంది.

మామిడి సహజంగా పండినదా లేదా అని ఎలా గుర్తించాలి?
మామిడి పండ్లను ఒక బకెట్ నీటిలో ఉంచండి.
మామిడిపండ్లు నీటిలో మునిగి ఉంటే, అవి సహజంగా పండినట్లు భావించండి.
అవి తేలుతూ ఉంటే, వాటిని కృత్రిమంగా పండించినట్లు గుర్తించాలి.
“కృత్రిమంగా పండించిన మామిడిలో చాలా తక్కువ  రసం ఉంటుంది. అయితే ఆర్గానిక్ మామిడిలో చాలా 'సహజ రసం' ఉంటుంది. మరొక సంకేతం ఏమిటంటే, ఒకసారి సగానికి కట్ చేస్తే, మీరు కృత్రిమంగా పండిన మామిడిలో, చర్మం దగ్గర ఉన్న తొడెం రంగు, లోపల ఉన్న దానికి భిన్నంగా ఉంటుంది, కానీ సహజంగా పండిన మామిడి మొత్తం పసుపు రంగులో ఉంటుంది.

సరైన మామిడిని ఎలా ఎంచుకోవాలి?
విశ్వసనీయ విక్రేతల నుండి మాత్రమే కొనుగోలు చేయండి.
తినడానికి ముందు పండ్లను శుభ్రమైన నీటితో శుభ్రంగా కడగాలి.
చర్మంపై నల్ల మచ్చలు ఉన్న పండ్లను కొనుగోలు చేయడం మానుకోండి, ఎందుకంటే ఈ పండ్లు కాల్షియం కార్బైడ్ నుండి ఉత్పత్తి చేసిన ఎసిటలీన్ గ్యాస్ ద్వారా పండినవి.

Also read: ఈసారి రంజాన్ పండుగ ఎప్పుడొచ్చింది..చంద్రోదయ సమయం,ప్రాముఖ్యత.!

#summer #fssai #raw-mango
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe