Snoring: ఇలా చేస్తే గురకకు చెక్‌ పెట్టవచ్చు!

తగినంత నిద్రపోవడం, సైడ్‌కు పడుకోవడం, నిద్రకు ముందు మద్యం తాగకుండా ఉండటం, వేడి నీటితో స్నానం చేయడం లాంటివి చేస్తే గురక సమస్య తగ్గుతుంది. ఒకవేళ స్లీప్ అప్నియా గురకకు కారణమైతే, దానికి చికిత్స అవసరం.

New Update
Snoring: ఇలా చేస్తే గురకకు చెక్‌ పెట్టవచ్చు!

How to ged rid of Snorning: గురక(Snoring).. పురుషులతో పాటు మహిళలూ ఎదుర్కొనే ఒక సాధారణ సమస్య. కొంతమంది పిల్లలు కూడా గురక పెడుతుంటారు. అయితే వయసు పెరిగే కొద్దీ గురక సమస్య పెరుగుతుంది. లైఫ్‌ స్టైల్‌లో మార్పులు చేసుకోవడం ద్వారా కచ్చితంగా గురకను తగ్గించవచ్చు. అయితే కొంతమందికి గురకను చెక్‌ పెట్టడానికి వైద్య చికిత్స అవసరం కావచ్చు. ముఖ్యంగా గురక నిద్ర రుగ్మతలతో ముడిపడి ఉంటుంది. గురకను ఆపడానికి అవసరం అయ్యే చిట్కాలను తెలుసుకోండి.

నిద్ర భంగిమలో మార్పులు: నిద్ర భంగిమలను మార్చడం వల్ల గురక సమస్యను తగ్గించవచ్చు లేదా ఆపవచ్చు. వీపుపై పడుకోవడం ద్వారా గురక సమస్య పెరగవచ్చు. అలాంటి సమయాల్లో మీరు సైడ్‌గా తిరిగి పడుకోవచ్చు. మీకు పక్కన పడుకోవడంలో ఇబ్బంది ఉంటే మీరు దిండు సహాయం తీసుకోవచ్చు. అయినప్పటికీ, గురక తగ్గకపోతే, అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్ అప్నియా కారణం కావచ్చు.

గురక కూడా స్లీప్ అప్నియాకు సంకేతం. నిద్రలో ఒక వ్యక్తి శ్వాస మందగించినప్పుడు లేదా 10 సెకన్ల వరకు శ్వాస ఆగిపోయినప్పుడు ఇది జరుగుతుంది. గాలి ప్రవాహం సాధారణం కంటే 90 శాతం కంటే తక్కువగా ఉన్నప్పుడు స్లీప్ అప్నియా సంభవిస్తుంది. స్లీప్ అప్నియా అనేది తీవ్రమైన వ్యాధి. దీనికి సరైన చికిత్స అవసరం.

బరువు తగ్గాలి:
బరువు తగ్గడం చాలా మందికి గురకను తగ్గించడంలో సహాయపడుతుంది. కానీ అందరికీ అలా జరగదు. కొన్నిసార్లు సన్నగా ఉన్నవారు కూడా గురక పెడతారు. అయితే మీరు అధిక బరువుతో ఉంటే ముందుగా ఆ బరువు తగ్గడానికి ప్రయత్నించండి. మీరు మెడ దగ్గర అధిక బరువు లేదా ఊబకాయం కలిగి ఉంటే గురక సంభవిస్తుంది.

ఆల్కహాల్ కు నో:
ఆల్కహాల్ గొంతు వెనుక భాగంలో కండరాల టోనింగ్‌ను తగ్గిస్తుంది. దీంతో గురక వచ్చే అవకాశాలు పెరుగుతాయి. నిద్రవేళకు నాలుగైదు గంటల ముందు మద్యం సేవించడం వల్ల గురక పెరుగుతుంది. సాధారణంగా గురక పెట్టని వారు మద్యం తాగిన తర్వాత గురక పెడతారట.

మంచి నిద్ర అలవాట్లు:
నిద్ర అలవాట్లు సరిగ్గా ఉండాలి. అందుకే రోజుకు కనీసం 7 గంటల నిద్ర అవసరం. ఇక అలసట కూడా గురకకు కారణం.

నాసికా మార్గం తెరవడం:
జలుబు లేదా దగ్గు లాంటి కారణం వల్ల ముక్కు మూసి ఉంటే గురకకు కారణమవుతుంది. నిద్రకు ముందు గోరు వెచ్చని స్నానం చేయడం నాసికా మార్గాలను తెరవడానికి సహాయపడుతుంది. ఉప్పు నీటితో ముక్కును శుభ్రం చేసుకోవడం కూడా ఉపశమనం కలిగిస్తుంది.

దిండ్లను మార్చండి:
దిండు అలెర్జీలు ఉండటం కూడా గురకకు ఒక కారణం కావచ్చు. సీలింగ్ ఫ్యాన్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం కూడా చాలా ముఖ్యం. అలెర్జీ కారకాలు చాలా త్వరగా దిండులకు అంటుకుంటాయి. అలెర్జీ ప్రతిచర్య వల్ల గురక సమస్యలకు దారితీస్తుంది. అదేవిధంగా.. పెంపుడు జంతువులను మీ మంచంపై నిద్రపోవడానికి అనుమతించడం కూడా ఈ సమస్యను కలిగిస్తుంది.

నీరు:
పుష్కలంగా నీరు తాగటం చాలా ముఖ్యం. నీరు ఎక్కువగా తాగడం వల్ల గురక సమస్య పెరుగుతుంది.

Also Read: కోహ్లీ అడ్డాలో రోహిత్ ఊచకోత.. హిట్‌మ్యాన్‌ దెబ్బకు అఫ్ఘాన్‌ బెంబేలు!

WATCH:

Advertisment
తాజా కథనాలు