Breasts Cancer: ప్రస్తుత కాలంలో ప్రతీ ఒక్కరికి క్యాన్సర్ల సమస్య కామన్ అయింది. మహిళల్లో వివిధరకాల క్యాన్సర్ల వ్యాధులు అధికంగా ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పలంటే బ్రెస్ట్ క్యాన్సర్ అందరిని వెధిస్తుంది. భారతదేశంలో ప్రతి 4 నిమిషాలకు ఒకరు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రతి 13 నిమిషాలకు క్యాన్సర్‌తో ఒకరు చనిపోతున్నారు. ప్రస్తుతం చాలా ఆధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి ఉన్నాయి. అయితే.. మమోగ్రామ్ పరీక్ష ద్వారా ఈ రొమ్ములో క్యాన్సర్ కణితుల్ని గుర్తిస్తారు. కానీ.. కొన్ని సార్లు దీనితో కూడా కణితులను గుర్తించడం చాలా కష్టం. అందుకే 40 ఏళ్లు దాటిన ప్రతీ స్త్రీలకు.. ముఖ్యంగా తల్లి కావాలనుకుంటున్న మహిళలకు, గర్భిణీలు తమ రొమ్ముల్లో మార్పులను గుర్తించాలన్నారు వైద్యులు. అనుమానం వచ్చిన వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలంటున్నారు.
ఈ లక్షణాలతో వెంటనే గుర్తు పట్టవచ్చు
అయితే... ఈ బ్రెస్ట్ భాగంలో ఏదైనా గట్టిగా ఉన్నా.. నొప్పిగా ఉన్నా.. డాక్టర్లను సంప్రదిస్తే క్యాన్సర్ సమస్య నుంచి వెంటనే బయటపడవచ్చు. పాలను ఉత్పత్తి చేసే రొమ్ముల్లో లోబుల్స్ గ్రంథుల ద్వారా, చనుమొనకు పాలను తీసుకెళ్లే నాళాల ద్వారా క్యాన్సర్ కణాలు వచ్చేలా చేస్తుంది. కాగా.. బ్రెస్ట్ క్యాన్సర్‌ను ఈ లక్షణాలతో వెంటనే గుర్తి పట్టవచ్చు. రొమ్ములో వాపు, ఒకే చోట లేదా మొత్తంగా వ్యాపించి ఉంటాయి. అయితే ఈ సమస్య ఉంటే రొమ్ములో కొంత భాగం ఎప్పుడూ గట్టిపడుతుంది. రొమ్ము చర్మం చికాకు కలిగిస్తూ ఎర్రగా మారుతుందని వైద్యులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి: జుట్టు రక్షణకు తులసి మంత్రం.. ఆకులతో ఇలా చేయండి
చనుమొన ప్రాంతంలో ఎరుపురంగుతో పాటు పుండ్లు అవుతాయి. చనుమొన నుంచి పాలు కాకుండా ఇతర ద్రవాలు కూడా వస్తాయి. చంకల కింది భాగంలో ఈ క్యాన్సర్ గడ్డలు కనిపిస్తాయని డాక్టర్లు చెబుతన్నారు. గర్భిణీల్లో అయితే గర్భధారణ టైంలో లేదా డెలివరీ తర్వాత ఏడాది లోపు రొమ్ము క్యాన్సర్ వస్తుందని వైద్యులు చెబుతున్నారు. గర్భిణీల్లో క్యాన్సర్ చికిత్స కణితి దశపై ఆధారపడి ఉంది. గర్భంలోపల ఉన్న పిండంపై దుష్ప్రభావాలు ఉండే అవకాశం ఉందని రేడియేషన్ థెరపీ నిపుణులు చెబుతున్నారు. పిండం 4 నెలల టైంలో కీమోథెరపీ, సర్జరీ చేయడం కూడా సమస్యగా ఉంటుంది. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ మహిళల్లో ఈ రొమ్ముక్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. జన్యు పరమైన కారణాలతో పాటు అతిగా బరువు పెరగడం, కొలెస్ట్రాల్ వంటి కారణాల వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతున్నట్టు నిపుణులు చెప్తున్నారు. కాబట్టి మహిళలు వయసుపెరిగే కొద్దీ బరువుపై శ్రద్ధ పెట్టి.. పోషకాహారం తీసుకుంటూ శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు.