How To Control Anger : కోపం(Anger) గా ఉండటం కూడా ఒక ఎమోషన్(Emotion) లో భాగమే. ఒక వ్యక్తి ఏదో ఒక విషయంలో కోపంగా ఉంటాడు. చాలా సార్లు కంట్రోల్ చేసుకోలేకపోతుంటారు. కోపాన్ని నియంత్రించలేనప్పుడు సంబంధాలు చెడిపోతాయి. చాలా మంది కోపంగా ఉన్న వ్యక్తితో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. కోపం మిమ్మల్ని మాత్రమే కాదు ఇతరులను కూడా బాధపెడుతుంది.
మీరు ఏదైనా విషయంలో కోపంగా ఉంటే ప్రశాంతంగా ఉండండి. అంతేకాకుండా 10 నుంచి 100 వరకు లెక్కించడం ప్రారంభించండి. ఇది వినడానికి వింతగా అనిపించినా ఈ టెక్నిక్ చాలా బాగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే లెక్కపెట్టడం ముగిసేప్పటి వరకు కోపం సాధారణ స్థితికి వస్తుందని, దీంతో ప్రశాంతంగా ఉంటారని చెబుతున్నారు.
గట్టిగా ఊపిరి తీసుకోండి:
ఎవరైనా కోపంగా ఉన్నప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం(Heart Beat) జరుగుతుంటుంది. అంతే కాకుండా శ్వాస కూడా పైకి కిందకి వెళ్లడం ప్రారంభమవుతుంది. అలాంటి పరిస్థితిలో శ్వాస వ్యాయామాలు చేయాలని నిపుణులు అంటున్నారు. అలాగే గట్టిగా ఊపిరి తీసుకోవాలని ఇలా చేయడం వల్ల కోపం సాధారణ స్థితికి చేరుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ శ్వాస పద్ధతిని దినచర్యలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని, మెదడుకు విశ్రాంతి ఇస్తుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా మనిషికి కోపం కూడా రాదని సలహా ఇస్తున్నారు. కోపంగా ఉన్నప్పుడు కోపం వెనుక ఉన్న కారణాల నుండి దృష్టిని మళ్లించడానికి ప్రయత్నించాలి. మీకు సంతోషాన్ని కలిగించే విషయాల గురించి ఆలోచించాలని అంటున్నారు.
వ్యాయామం చేయండి
కోపంగా ఉన్నప్పుడు శారీరక వ్యాయామం(Exercise) చేయాలని వైద్యులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంని చెబుతున్నారు.వ్యాయామం చేయడం వల్ల కోపం తగ్గిపోయి సంతోషంగా ఉండవచ్చని, ప్రతిరోజూ నడక, యోగా కోసం కొన్ని నిమిషాలు వెచ్చించాలని చెబుతున్నారు.
Also Read : ఇలా చేస్తే వయసుతో పాటు ప్రేమ కూడా పెరుగుతుంది!