బరువు తగ్గించుకునేందుకు మెంతులు ఉత్తమమైనవి. చాలా సులభంగా మీ బరువును తగ్గించుకోవడంతోపాటు ఫిట్ గా ఉంచేందుకు మెంతులు ఎంతో ఉపయోగపడతాయి.
మెంతి టీ : మీరు ప్రతిరోజూ ఉదయం టీ, కాఫీలు తాగే బదులుగా మెంతులతో తయారు చేసిన టీ తాగినట్లయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఈ టీని తాగడం అలవాటు చేసుకోండి.
మెంతులతో తయారు చేసిన నీరు కూడా ఎంతో మేలు చేస్తుంది. మెంతులను ఒకరోజు రాత్రి నానబెట్టి..తెల్లవారి ఉదయం ఆ నీళ్లను తాగండి. కొన్ని రోజుల్లో మీ శరీరంలో కలిగే మార్పులను గమనిస్తారు.
రోటీ కానీ, చపాతీ కానీ చేసేప్పుడు ఆ పిండిలో చిటికెడు మెంతి పొడి కలపండి. లేదంటే సాంబారులో మెంతికూరను వేయండి.
పచ్చి కూరగాయల్లాగే మెంతికూర పచ్చడి కూడా చేసుకోవచ్చు. నూనె, వెన్న, నెయ్యి తగ్గించి మెంతి కూర ఆకులు వేసి పల్వ, గొజ్జలు చేసుకోవాలి.
బరువు తగ్గించేందుకు ఉపయోగిస్తున్న ఆహారంతో పాటు మెంతులను కూడా చేర్చుకోండి. మీరు బరువు తగ్గించే వంటకాల్లో, పానీయాల్లో కూడా మెంతులను చేర్చుకోవచ్చు.
ఇది కూడా చదవండి: మీ ఆత్మీయులకు దీపావళి శుభాకాంక్షలు ఇలా చెప్పండి..!!