Health Tips : ఇలియానా లాంటి నడుము మీ సొంతం కావాలంటే...ఇవి తినాల్సిందే..!! బరువు తగ్గించడంలో మెంతులు ఎంతో మేలు చేస్తాయి. చాలా సరళంగా మీరు బరువు తగ్గడానికి, ఫిట్ గా ఉండేందుకు మెంతులను ప్రతిరోజూ మీ డైట్లో చేర్చుకోండి. By Bhoomi 11 Nov 2023 in లైఫ్ స్టైల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి బరువు తగ్గించుకునేందుకు మెంతులు ఉత్తమమైనవి. చాలా సులభంగా మీ బరువును తగ్గించుకోవడంతోపాటు ఫిట్ గా ఉంచేందుకు మెంతులు ఎంతో ఉపయోగపడతాయి. మెంతి టీ : మీరు ప్రతిరోజూ ఉదయం టీ, కాఫీలు తాగే బదులుగా మెంతులతో తయారు చేసిన టీ తాగినట్లయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఈ టీని తాగడం అలవాటు చేసుకోండి. మెంతి టీతో మీ రోజును ప్రారంభించండి. ఇది డయాబెటిస్ రోగులకు ఎంతో మేలు చేస్తుంది. మెంతులతో తయారు చేసిన నీరు కూడా ఎంతో మేలు చేస్తుంది. మెంతులను ఒకరోజు రాత్రి నానబెట్టి..తెల్లవారి ఉదయం ఆ నీళ్లను తాగండి. కొన్ని రోజుల్లో మీ శరీరంలో కలిగే మార్పులను గమనిస్తారు. మెంతులతో సలాడ్ కూడా చేసుకోవచ్చు. మీ ఆహారంలో మెంతులను చేర్చండి. ఏదైనా తాజా కూరగాయలను ఉపయోగించి మొలకెత్తిన మెంతిగింజలను కలిపి తినండి. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. రోటీ కానీ, చపాతీ కానీ చేసేప్పుడు ఆ పిండిలో చిటికెడు మెంతి పొడి కలపండి. లేదంటే సాంబారులో మెంతికూరను వేయండి. పచ్చి కూరగాయల్లాగే మెంతికూర పచ్చడి కూడా చేసుకోవచ్చు. నూనె, వెన్న, నెయ్యి తగ్గించి మెంతి కూర ఆకులు వేసి పల్వ, గొజ్జలు చేసుకోవాలి. బరువు తగ్గించేందుకు ఉపయోగిస్తున్న ఆహారంతో పాటు మెంతులను కూడా చేర్చుకోండి. మీరు బరువు తగ్గించే వంటకాల్లో, పానీయాల్లో కూడా మెంతులను చేర్చుకోవచ్చు. ఇది కూడా చదవండి: మీ ఆత్మీయులకు దీపావళి శుభాకాంక్షలు ఇలా చెప్పండి..!! #health-tips #healthy-diet #fenugreek-health-benefits మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి