Grapes Clean Tips: బ్యాక్టీరియా పోవాలంటే ద్రాక్షపండ్లను ఎలా శుభ్రం చేయాలి?..నిల్వ చేయడం ఎలా?

ద్రాక్షను సాగుచేసే వ్యవసాయ పద్ధతుల వల్ల ఆ పండ్లలో కీటకాలు, బ్యాక్టీరియా మొదలు అనేక రసాయన అవశేషాలు ఉంటాయి. ద్రాక్షను శుభ్రంగా కడుక్కోకుండా తినడం ప్రమాదకరంతోపాటు సరిగా నిల్వ చేయకపోతే ఎన్నో వ్యాధులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

New Update
Grapes Clean Tips: బ్యాక్టీరియా పోవాలంటే ద్రాక్షపండ్లను ఎలా శుభ్రం చేయాలి?..నిల్వ చేయడం ఎలా?

Grapes Clean Tips: ద్రాక్ష పండ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే ద్రాక్షను సాగుచేసే వ్యవసాయ పద్ధతుల వల్ల ఆ పండ్లలో కీటకాలు, బ్యాక్టీరియా మొదలు అనేక రసాయన అవశేషాలు ఉంటాయి. కాబట్టి ద్రాక్షను శుభ్రంగా కడుక్కోకుండా తినడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరిగా కడుక్కోకుండా తినడం, సరిగా నిల్వ చేయకపోతే ఎన్నో వ్యాధులు వస్తాయని అంటున్నారు. ఏదైనా పురుగుమందులు లేదా రసాయన పూతలను తొలగించడానికి ద్రాక్ష శుభ్రంగా కడగడం చాలా ముఖ్యం. వెనిగర్, బేకింగ్ సోడాలో 15 నిమిషాలు నానబెట్టి ఆపై మూడు లేదా నాలుగు సార్లు శుభ్రం చేసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

publive-image

ద్రాక్షను ఎలా కడగాలి..?

ద్రాక్షను ఉప్పు, బేకింగ్ సోడా కలిపిన నీటిలో 5-7 నిమిషాలు నానబెట్టాలి. రసాయనాలను తొలగించడంలో బేకింగ్ సోడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే వెనిగర్ కూడా బ్యాక్టీరియాతో పోరాడుతుంది. కానీ ఈ పద్ధతి ప్రభావం శాస్త్రీయంగా నిరూపించబడలేదు. మురికి, మలినాలను తొలగించేందుకు ద్రాక్షను మంచి నీళ్లలో శుభ్రంగా కడుక్కోవాలని కొందరు నిపుణులు అంటున్నారు.

publive-image

ద్రాక్షను ఎలా నిల్వ చేయాలి..?

ద్రాక్షను నిల్వ చేయడానికి కడిగిన తర్వాత బాగా ఆరనివ్వాలి. తేమగా ఉంటే బ్యాక్టీరియామరింత ఎక్కువ అవుతుంది. అందుకే ద్రాక్షను బాగా కడిగిన తర్వాత శుభ్రంగా తేమలేకుండా చేసి దాన్ని గాలి చొరబడని కంటైనర్‌లో ఉంచాలి. ఆ తర్వాత ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ కాలం పాడుకాకుండా ఉంటాయి.

ఇది కూడా చదవండి: ఇదేం పైత్యంరా నాయనా.. ఏకంగా మనుషుల్ని కరిచేశాడు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
తాజా కథనాలు