Cricket Umpire: క్రికెట్ అంపైర్ అవ్వడం ఎలా? జీతం తెలుసుకుంటే షాక్‌ అవుతారు!

క్రికెట్ అంపైర్ కావాలంటే క్రికెటర్ కావాల్సిన పని లేదు. మీకు ఎంసీసీ(MCC)క్రికెట్ బుక్‌పై పూర్తిస్థాయి పట్టు ఉండాలి. బీసీసీఐ కండెక్ట్ చేసే లెవల్ 1, లెవెల్ 2 రెండు పరీక్షలను క్లియర్ చేయాలి. అంతర్జాతీయ క్రికెట్ అంపైర్ ఒక్కో మ్యాచ్‌కి(టెస్ట్): రూ.2,00,000 లక్షలు సంపాదిస్తాడు.

Cricket Umpire: క్రికెట్ అంపైర్ అవ్వడం ఎలా? జీతం తెలుసుకుంటే షాక్‌ అవుతారు!
New Update

ఇండియాలో క్రికెట్‌ మతం. అయితే ఆడతారు.. లేకపోతే చూస్తారు.. క్రికెట్ తెలియని వారు దేశంలో చాలా తక్కువ మంది ఉంటారు. ఇక క్రికెట్‌ను చాలా మంది కెరీర్‌గా ఎంచుకుంటారు. సక్సెస్‌ అయినా అవ్వకున్నా ఆట చేసే మేలును వెలకట్టలేం. ఇక క్రికెట్‌పై ఇష్టం ఉంటే ప్లేయరగానే ఉండలని లేదు. క్రికెట్‌ ఎన్నో ఉపాధులను కల్పిస్తుంది. వాటిలో క్రికెట్ స్కోరర్‌, క్రికెట్‌ అంపైర్ చాలా మందికి తెలిసినవే. కొంతమందికి క్రికెట్ అంపైర్ అవ్వాలన కల ఉంటుంది. అయితే ప్రాసెస్ తెలియదు. అందుకే ఈ స్టెప్స్ తెలుసుకోండి.



మన దేశం నుంచి అంపైర్‌గా మారడానికి ఈ స్టెప్స్‌ ఫాలో అవ్వండి.

అంపైరింగ్‌ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు తమ పేర్లను భారత్‌ క్రికెట్ బోర్డు-బీసీసీఐ(BCCI)కి ఫార్వార్డ్ చేయడానికి బాధ్యత వహించే సంబంధిత రాష్ట్ర సంఘాలతో నమోదు చేసుకోవాలి.

స్థానిక మ్యాచ్‌లను నిర్వహించే అవకాశం పొందాలి.

బీసీసీఐ(BCCI) సంవత్సరానికి లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే లెవల్ 1 పరీక్ష కోసం ఈ పేర్లను పంపిస్తారు.

లెవెల్ 1 పరీక్షలో హాజరయ్యే అభ్యర్థుల కోసం బీసీసీఐ మూడు రోజుల పాటు కోచింగ్ తరగతులను ఏర్పాటు చేస్తుంది.

పరీక్షల్లో అభ్యర్థుల పనితీరు ఆధారంగా, వారిని షార్ట్‌లిస్ట్ చేస్తారు.

షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆధారంగా మరొక పరీక్షకు హాజరు కావాలి. ఇది మౌఖిక పరీక్ష.

రెండు పరీక్షలను క్లియర్ చేసిన అభ్యర్థులు ఒక సంవత్సరం గ్యాప్‌ తర్వాత నిర్వహించే లెవల్ 2 పరీక్షకు హాజరు కావాలి.

లెవల్ 2 పరీక్షలో రాత, ప్రాక్టికల్‌తో పాటు వైవా ఉంటుంది.

లెవల్ 1, లెవెల్ 2 రెండు పరీక్షలను క్లియర్ చేసిన అభ్యర్థులు తప్పనిసరిగా మెడికల్ టెస్ట్‌కు హాజరు కావాలి.

లెవెల్ 2 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు BCCI అంపైర్‌గా గుర్తింపు పొందిన తర్వాత ఇండక్షన్ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది



జీతం:

మీరు ఎలైట్ ప్యానెల్‌లో ఉన్న అంపైర్ అయితే ప్రతి ఐపీఎల్(IPL) మ్యాచ్‌కు మీకు రూ. 1.98 లక్షల ఫీజ్‌ చెల్లిస్తుంది బీసీసీఐ. మరోవైపు డెవలప్‌మెంట్ అంపైర్లు రెండో కేటగిరీలో ఉన్నారు. ఒక్కో మ్యాచ్‌కు 59 వేల రూపాయలు అందుకుంటారు. ఒక నివేదిక ప్రకారం, ఒక అంపైర్ సగటున 20 మ్యాచ్‌లలో అంపైరింగ్ చేస్తున్నాడు. ఫలితంగా ఐపీఎల్ సీజన్‌లో అంపైర్ దాదాపు రూ.40 లక్షలు సంపాదించవచ్చు.

Also Read: విశాఖలో మ్యాచ్‌ అంటే ఆ మజానే వేరు.. ఇలాంటి అనుభూతి ఎక్కడా రాదు!

WATCH:

#cricket #india-vs-australia #cricket-umpire-salary
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe