Skin Care: యవ్వనంగా కనిపించాలంటే ముఖంపై హైలురోనిక్‌ యాసిడ్‌ ఎలా అప్లై చేయాలి?

చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చాలనుకుంటే హైలురోనిక్‌ యాసిడ్‌ సరైన ఎంపిక.హైలురోనిక్ యాసిడ్ అనేది చర్మంలోని నీటిని ఆకర్షిస్తుంది. దీనిని వాడటం వల్ల చర్మం మృదువుగా, మెరిసేలా చేయటంతోపాటు ఎప్పుడూ యవ్వనంగా, చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు.

New Update
Skin Care: యవ్వనంగా కనిపించాలంటే ముఖంపై హైలురోనిక్‌ యాసిడ్‌ ఎలా అప్లై చేయాలి?

Skin Care: హైలురోనిక్ యాసిడ్ అనేది చర్మంలోని నీటిని ఆకర్షిస్తుంది. అంతేకాకుండా డీప్‌గా చర్మాన్ని హైడ్రేట్‌ చేస్తుంది. దీనిని వాడటం వల్ల చర్మం మృదువుగా, మెరిసేలా చేస్తుంది. దీంతో ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారని నిపుణులు అంటున్నారు. చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చాలనుకుంటే హైలురోనిక్‌ యాసిడ్‌ సరైన ఎంపిక. ప్రతిరోజు దీన్ని వాడటం వల్ల చర్మం ఎప్పుడూ మెరుస్తూ ఉంటుంది. అంతేకాకుండా స్మూత్‌గా తయారవుతుంది. హైలురోనిక్ యాసిడ్ అనేది మీ చర్మానికి తక్షణ మెరుపును అందించే ఒక రకమైన మాయిశ్చరైజర్‌. హైలురోనిక్ యాసిడ్ అనేది మన శరీరంలో దానంతటదే అదే ఉత్పత్తి అవుతుంది. అంతేకాకుండా ప్రత్యేకంగా ల్యాబ్‌లలో కూడా తయారు చేస్తారు. శాస్త్రవేత్తలు కొన్ని బ్యాక్టీరియాలను పెంచడం ద్వారా దీన్ని తయారు చేస్తారు. దీని వల్ల హైలురోనిక్‌ యాసిడ్‌ తయారు అవుతుంది. దీనిని క్రీమ్‌ లేదా ఇంజెక్షన్‌ రూపంలో కూడా వాడవచ్చు. సహజసిద్దమైన లేదా ల్యాబ్‌లో తయారైన హైలురోనిక్‌ యాసిడ్‌ మన చర్మంలోని నీటిని గ్రహిస్తుంది. అంతేకాకుండా తాజాగా ఉండేలా చేస్తుంది. హైలురోనిక్ యాసిడ్ సీరమ్‌లు, క్రీమ్‌లు, మాస్క్‌ల రూపంలో లభిస్తుంది. దీన్ని మీ చర్మ సంరక్షణ దినచర్యలో భాగంగా చర్మానికి రాసి ఆ తర్వాత మాయిశ్చరైజర్‌ని అప్లై చేయాలి. వాడిన తర్వాత కచ్చితంగా దీనికి సీల్‌ చేయడం మర్చిపోవద్దు.

స్కిన్ గ్లో పెంచుతుంది:

  • హైలురోనిక్ యాసిడ్ చర్మాన్ని లోపలి నుంచి మెరిసేలా చేస్తుంది, మీ చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

చర్మం రక్షణ:

  • చర్మం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఇంటి చిట్కాలను కూడా పాటించాలి. ఎప్పుడూ ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. బయటికి వెళ్లేప్పుడు సన్‌ క్రీమ్‌లు రాసుకోవాలి. అంతేకాకుండా కాలుష్యం నుంచి కాపాడుకోవడానికి ముఖానికి మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలి. బండిపై వెళ్తుంటే హెల్మెట్‌ పెట్టుకుంటే ముఖంపై దుమ్మూధూళి పడకుండా ఉంటుంది.

ఇది కూడా చదవండి: తల్లులకు ప్రత్యేకమైన రోజు..! పిల్లల దీర్ఘాయువు, శ్రేయస్సు కోసం ఇలా చేయండి..!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు