Health Tips: టీవీ చూస్తూ నిద్రపోయే అలవాటు ప్రమాదమా?

టీవీ చూస్తూ నిద్రపోయే అలవాటు ఉంటే మధుమేహం, బీపీ, బరువు పెరగడంతో పాటు గుండె జబ్బులు వస్తాయని వైద్యులు అంటున్నారు. ఇన్సులిన్‌ స్థాయిలో సమస్య ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు.

New Update
Health Tips: టీవీ చూస్తూ నిద్రపోయే అలవాటు ప్రమాదమా?

Health Tips: ఇటీవలి కాలంలో కోవిడ్-19 మహమ్మారి తర్వాత, నెట్‌ఫ్లిక్స్ వంటి OTT ప్లాట్‌ఫారమ్‌లకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ గణనీయంగా పెరిగింది. దీని కారణంగా చాలా మంది తమ ఖాళీ సమయాన్ని టీవీ స్క్రీన్ ముందు గడుపుతున్నారు. ఒక పరిశోధన ప్రకారం టీవీ చూస్తూ నిద్రపోయే అలవాటు ఉన్నవారికి ఇన్సులిన్ స్థాయిలో సమస్య ఏర్పడుతుందని తేలింది. దీని కారణంగా శరీరంలో చక్కెర పరిమాణం పెరుగుతుంది.

ఎలాంటి సమస్యలు ఉంటాయి?:

టీవీ  చూస్తూ అలాగే నిద్రపోవడం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు ప్రమాదం ఉంటుంది. బీపీ, షుగర్, బరువు పెరగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.

శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?:

చికాగోలోని నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో వాళ్లు చేసిన ఒక అధ్యయనం చేశారు. టీవీ చూస్తూ నిద్రపోయే అలవాటు ఉన్న 550 మందిపై ప్రయోగాలు చేశారు. అలాంటి వారికి బరువు పెరగడం, మధుమేహం, బీపీ, ఎక్కువగా ఉన్నాయని, అంతేకాకుండా కండరాల నొప్పి లేదా ఇతర కండరాల సంబంధిత సమస్యలను కూడా వస్తాయని నిర్థారించారు.

నిపుణులు ఇచ్చే సలహా ఏంటి?:

బాగా నిద్రపోవడానికి ప్రతిరోజూ ధ్యానం చేయండి. పుస్తకాలు చదివే అలవాటును పెంపొందించుకోండి. అదనంగా ఆరోగ్యకరమైన ఆహారం, ఎక్కువ నీరు తాగడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకోవాలని, ఇవి మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఏ పనిచేసినా అవసరాన్ని బట్టి చేయాలని, మితంగా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. కేవలం టీవీ, స్మార్ట్ ఫోన్లతోనే గడపకుండా మంచి పుస్తకాలు చదవడం, నలుగురితో కలిసి మాట్లాడుకోవడం, వ్యాయామాలు, క్రీడలు లాంటివి చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదని, మనసుకు కూడా ప్రశాంతత ఉంటుందని, ఎలాంటి ఒత్తిడి, డిప్రెషన్ మీ దరి చేరదని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: పిల్లలకు ఎక్కిళ్లు ఎందుకు వస్తాయి?..తగ్గాలంటే ఎలా?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">

Advertisment
తాజా కథనాలు