Women Sleep : మహిళలు రోజుకు ఎన్ని గంటలు నిద్రించాలి?.. పరిశోధకులు ఏమంటున్నారు?

మహిళలు ఎక్కువ రోజులు నిద్రలేమితో బాధపడుతుంటే గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓ అధ్యయనం ప్రకారం 7 గంటల కంటే తక్కువగా నిద్రపోకపోవడం మహిళల్లో గుండెపోటు ప్రమాదాన్ని 70 శాతం పెంచుతుంది. నిద్ర ఎక్కువగా పోని మహిళల్లో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుందని తేలింది.

Women Sleep : మహిళలు రోజుకు ఎన్ని గంటలు నిద్రించాలి?.. పరిశోధకులు ఏమంటున్నారు?
New Update

Scientists Says About Women Sleep : యూనివర్సిటీ ఆఫ్ పిట్స్‌బర్గ్‌(University Of Pittsburgh) లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం 7 గంటల కంటే తక్కువగా నిద్రపోకపోవడం మహిళ(Women's) ల్లో గుండెపోటు ప్రమాదాన్ని 70 శాతం పెంచుతుందని అంటున్నారు. ఒక కొత్త అధ్యయనం ప్రకారం మహిళలు ఎక్కువ రోజులు నిద్రలేమితో బాధపడుతుంటే గుండె జబ్బులు(Heart Diseases) ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. 42 నుంచి 52 ఏళ్ల మధ్య వయసున్న 2,517 మంది మహిళలపై శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. ఎంతసేపు నిద్రపోయారు, వారి గుండె పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్నారు. నిద్ర ఎక్కువగా పోని మహిళల్లో నలుగురిలో ఒకరికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 70 శాతం ఉందని పరిశోధనలో తేలింది. అదే సమయంలో 5 గంటల కంటే తక్కువ నిద్రపోయే మహిళల్లో 72 శాతం మంది గుండెపోటు(Heart Attack), స్ట్రోకులు(Heart Stokes), గుండె వైఫల్యంతో(Heart Failure) బాధపడుతున్నారని నిపుణులు అంటున్నారు.

నిద్రలేమితో వచ్చే సమస్యలు:

  • నిద్ర లేకపోవడం(No Sleep) వల్ల మహిళల్లో అధిక రక్తపోటు, ఇన్సులిన్ సమస్యలు, రక్తనాళాలు దెబ్బతింటాయని పరిశోధకులు గుర్తించారు. అంతేకాకుండా నిద్ర లేకపోవడం మహిళల్లో ఊబకాయం ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు.

నిద్రలేమి సమస్యను ఎలా అధిగమించాలి?

  • నిపుణుల అభిప్రాయం ప్రకారం శరీరం, మనస్సు ప్రశాంతంగా ఉండటానికి ధ్యానం, యోగా చేయాలంటున్నారు. వారానికి 150 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు. ఒత్తిడి కారణంగా నిద్రపోలేకపోతే మసాజ్ ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని అంటున్నారు. మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని తినాలని, నిద్రపోవడానికి 2 గంటల ముందు భోజనం చేయాలని, టీ, కాఫీ మానుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. అంతేకాకుండా పడుకోవడానికి 2 గంటల ముందు మొబైల్ ఫోన్ పక్కన పెట్టాలని, గోరువెచ్చని నీటితో స్నానం చేసి పడుకునేప్పుడు గదిలోని లైట్లు ఆపివేయాలని అంటున్నారు.

ఇది కూడా చదవండి: పప్పులో పసుపుని ఎప్పుడు వేస్తే బాగుంటుంది?… ఎంత వేస్తే మంచిది?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-tips #health-care #health-problems #women-sleep
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe