Obesity: ప్రస్తుత రోజుల్లో ప్రతి పది మందిలో ఏడుగురు ఊబకాయంతో (Obesity) బాధపడుతున్నారు. ఇది వాస్తవానికి జీవనశైలి, జీవక్రియకు సంబంధించిన వ్యాధి. రోజులు గడుస్తున్న కొద్ది ఈ వ్యాధి తీవ్రంగా మారుతుంది. ప్రస్తుతం ఊబకాయానికి సంబంధించిన ఓ వార్త ప్రజలను మరింత కలవర పెడుతుంది. అది ఏంటంటే..పిల్లల్లో వచ్చే ఊబకాయానికి వారసత్వం కారణం కావొచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఓ అధ్యయనం ప్రకారం, తల్లిదండ్రులు వారి మధ్య వయస్సులో ఊబకాయంతో ఉంటే, వారి పిల్లలలో కూడా అదే విషయం కనిపిస్తుంది. పిల్లలలో ఈ ప్రమాదం ఆరు రెట్లు ఎక్కువగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు వివరించారు.
తల్లిదండ్రుల ఊబకాయం.. పిల్లలలో ఊబకాయం ప్రమాదాన్ని 6 రెట్లు పెంచుతుంది
యూనివర్శిటీ ఆఫ్ నార్వే పరిశోధకులు ఓ పరిశోధన చేశారు. ఈ పరిశోధన ప్రకారం, ఊబకాయంతో పోరాడడం అనేది ఒక వ్యక్తిని జీవితాంతం ఇబ్బంది పెడుతుంది. కానీ, అది బాల్యం నుండే మొదలవుతుంది. అంతేకాకుండా అది మీ తల్లిదండ్రుల ఆరోగ్యానికి సంబంధించినది కావచ్చు. నిజానికి మధ్యవయస్సులో అంటే 40 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు స్థూలకాయంతో బాధపడేవారు మధ్యవయస్సులో కూడా స్థూలకాయానికి గురవుతారని ఈ పరిశోధనలో తేలింది.
నిజానికి, ఊబకాయం జన్యువుల ద్వారా బదిలీ అవుతుంది. ఊబకాయం ఉన్న తల్లిదండ్రుల పిల్లలు ఊబకాయం అయ్యే ప్రమాదం 6 రెట్లు ఎక్కువ.
పిల్లలలో ఊబకాయం జన్యుపరమైన రుగ్మత
పిల్లలలో స్థూలకాయం, జన్యుపరమైన కారణాల వల్ల ఏర్పడినప్పుడు, ప్రేడర్-విల్లీ సిండ్రోమ్, WAGR సిండ్రోమ్, SIM1 సిండ్రోమ్, ప్లియోట్రోపిక్ సిండ్రోమ్‌ల వంటి క్రోమోజోమ్ ఒబేసిటీగా వర్గీకరించవచ్చు. ఇదంతా తల్లిదండ్రుల జన్యువులకు సంబంధించినది. అటువంటి పరిస్థితిలో, మీ బిడ్డ చిన్నతనంలోనే ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి, జాగ్రత్తగా ఉండండి.
పిల్లల్లో ఊబకాయాన్ని ఎలా నివారించాలి?
పిల్లలలో ఊబకాయాన్ని నివారించడానికి, మొదట వారి శారీరక శ్రమపై శ్రద్ధ వహించాలి. వారి జీవక్రియను వేగవంతం చేయాలి. తద్వారా వారు తినేది జీర్ణం అవుతుంది. వారు బరువు పెరగరు. అలాగే క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని పిల్లలకు ఇవ్వకుండా ఉండండి. అన్నింటికంటే, ఫాస్ట్ ఫుడ్ అంటే పిజ్జా-బర్గర్స్ వంటి వాటికి అలవాటు పడకండి. అలాగే ప్రతిరోజూ 2 గంటల పాటు ఇంటి బయట ఏదో ఒక క్రీడ ఆడేలా వారిని ప్రోత్సహించండి.
Also read: పుదీనా లో ఉండే విటమిన్ ఏంటి.. దీని ఎప్పుడు ఎలా తినాలో తెలుసుకుందామా!