Pirola: బాబోయ్.. 36 మ్యూటేషన్లా.. ఈ కరోనా కజిన్ తో మూడినట్టేనా

దీని గురించి ఇంకా పూర్తిగా తెలియనే లేదు...ఇప్పుడు మరో కొత్త వేరియంట్ వచ్చిందని తెలుస్తుంది. దాని పేరు కూడా విచిత్రంగానే ఉంది. ''పిరోలా'' (BA.2.86) అని దానికి కొత్తగా నామాకరణం కూడా చేశారు.

New Update
Pirola: బాబోయ్.. 36 మ్యూటేషన్లా.. ఈ కరోనా కజిన్ తో మూడినట్టేనా

New Covid Variant Pirola: కరోనా(Covid)..ఈ పేరు వింటే ఇప్పటికీ చాలా మంది గుండెల్ని చేతితో పట్టుకుంటారు. వామ్మో కరోనా అంటూ ఇప్పటికీ అదిరిపోయి బెదిరిపోయే వారు చాలా మందినే ఉన్నారు. కరోనా తరువాత కొత్త వేరియంట్లు ప్రపంచాన్ని గడగడలాడించాయి. కొంత కాలం క్రితం ఎరిస్‌ అనే వెరియంట్ వెలుగు చూసింది.

ఈ వేరియంట్‌ కి సంబంధించిన కేసులు ఇండియాతో పాటు ప్రపంచాన్ని కూడా వణికించాయి. దీని గురించి ఇంకా పూర్తిగా తెలియనే లేదు...ఇప్పుడు మరో కొత్త వేరియంట్ వచ్చిందని తెలుస్తుంది. దాని పేరు కూడా విచిత్రంగానే ఉంది. ''పిరోలా'' (BA.2.86) అని దానికి కొత్తగా నామాకరణం కూడా చేశారు.

ఇది ఒమిక్రాన్‌ కే సబ్ వేరియంట్ అంట..ఈ పిరోలా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి అని నిపుణులు తెలియజేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతి తక్కువ సమయంలోనే చాలా దేశాల్లో కేసులు నమోదు అయ్యాయని తెలియజేశారు. కొత్త వేరియంట్‌ను డబ్ల్యూహెచ్‌ఓ వేరియంట్ అండర్ మానిటరింగ్ గా వర్గీకరించింది.

Also Read: రైతులకు అలర్ట్.. 15వ విడత కిసాన్ నిధులు పడాలంటే ఈ పనులు చేయాల్సిందే..

ఒరిజినల్ వేరియంట్ తో పోలిస్తే పిరోలా 35 కంటే ఎక్కువ సబ్‌ వేరియంట్స్ ను కలిగి ఉంటుందని చాలా త్వరగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పిరోలా కి సంబంధించిన కేసులు ప్రస్తుతం ఇజ్రాయెల్, కెనడా, డెన్మార్క్, యూకే, దక్షిణాఫ్రికా, స్వీడన్, నార్వే,థాయ్‌ లాండ్ దేశాల్లో కేసులు వచ్చాయి.

2021 లో వచ్చిన ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా భారీగా మరణాలు నమోదు అయ్యాయి. అయితే సబ్‌ వేరియంట్‌ పిరోలా వల్ల మరింత ప్రమాదం పొంచి ఉందని పరిశోధకులు వివరిస్తున్నారు. దీనిలో 36 మ్యుటేష‌న్లు ఉన్నాయ‌ని నిపుణులు పేర్కొంటున్నారు. ఇవి రోగి శరీరంలోకి ప్రవేశించినప్పుడు చాలా ఈజీగా రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకుంటాయని, అతి తక్కువ సమయంలోనే ఎక్కువ మందికి సోకే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

నిజానికి ఇదే చూపే ప్రభావం గురించి పూర్తిగా తెలుసుకోవాల్సి ఉందని తెలిపారు. కొవిడ్‌ టీకాలు తీసుకున్నప్పటికీ కూడా పిరోలా దాడి ఉంటుందని వారు వివరించారు. కొత్త వేరియంట్ స్పైక్ ప్రోటీన్‌లో 30 ఉత్ప‌రివ‌ర్త‌నాలు ఉన్నాయ‌ని, ఇవి మానవకణాల్లోకి సులువుగా ప్రవేశించడానికి వీలు క‌ల్పిస్తాయ‌న్నారు. పిరోలా మ్యుటేష‌న్లు గ‌తంలోని వ‌చ్చిన వేరియంట్లో పోలిస్తే భిన్నంగా ఉన్నాయ‌న్నారు. అయితే పిరోలా తీవ్రతకు సంబంధించినంత వరకు కూడా ముందు వాటితో పోలిస్తే ఇవి ఎంత వరకు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయనేది తెలుసుకోవాల్సి ఉంది.

Also Read: విక్రమ్ ల్యాండర్ మరోసారి సాఫ్ట్ ల్యాండింగ్.. ఇస్రో అరుదైన ఘనత

Advertisment
తాజా కథనాలు