Elections : హోమ్‌లెస్ ఓటర్లను ఎలా గుర్తిస్తారు?

భారతదేశంలో పేదవారు, సరైన ఇల్లు కూడా లేనివారు,రోడ్డు, ఫుట్ పాత్‌ల మీద నిద్రించే వాళ్ళు చాలా మంది ఉంటారు. వీరికి ఒక స్థలం అంటూ ఉండదు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో హోమ్‌లెస్‌ ఓటర్లను గుర్తించేదెలా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వాటికి ఈసీఐ ఒక సొల్యూషన్ చెప్పింది.

Elections : హోమ్‌లెస్ ఓటర్లను ఎలా గుర్తిస్తారు?
New Update

Homeless Voters : భారతదేశం(India) లో ఎన్నికల హడావుడి మొదలయింది. మే 13 నుంచి మొత్తం దేశమంతటా సార్వత్రిక ఎన్నికలు(General Elections) జరగనున్నాయి. వీటితో పాటూ కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక(Assembly Elections) లకు కూడా తేదీలను ప్రకటించింది ఈసీఐ. ఈ నేపథ్యంలో పార్టీలు ప్రచారాలు మొదలెట్టేశాయి. ప్రతీ ఓటరు ను కౌంట్ చేసుకుంటూ ముందుకు దూసుకువెళుతున్నాయి. అయితే ఇదే సందర్భంలో ఇళ్ళు, అడ్రస్‌లు ఉన్నవారు ఓటర్ కార్డులు(Voter Cards) కలిగి ఉంటారు. కానీ ఇండియాలో హోమ్‌లెస్ జనాలు(Homeless Voters) కూడా చాలా మంది ఉంటారు. రోడ్లు మీదనే జీవనం సాగించే పేదవారు వేలల్లోనే ఉంటారు. కానీ వాళ్ళు కూడా భరతదేశ పౌరులే. మరి వాళ్ళు ఓటు వేయాలంటే ఎలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇప్పుడు. వారికి అడ్రస్ ఉండదు కాబట్టి...వారు ఓటర్ గుర్తింపు కార్డును ఎలా పొందుతారనే సందేహాలు వెలుగు చూస్తున్నాయి.

బూత్ లెవల్ ఆఫీసర్ల వెరిఫికేషన్..

ఈ మొత్తం ప్రశ్నలన్నింటికీ ఈసీఐ(ECI) సమాధానాలు చెప్పింది. ఇళ్ళు లేని వారు, రోడ్ల మీదనే ఉండేవారు ఓటర్ గుర్తింపు కార్డు కోసం నమోదు చేసుకునేటప్పుడు వారు ఎక్కడ నివసిస్తున్నారో తెలియజేయాలి. అది తాత్కాలికమైనా సరే. ఓటర్ గుర్తింపు కార్టు వచ్చే వరకు వారు అక్కడే ఉండేలా చూసుకోవాలి. అప్పుడు ఓటర్ అప్లికేషన్ ఫామ్‌(Voter Application Form) లో వారు ఉంటున్న చోటును మెన్షన్ చేయాలి. అలా చేసిన తర్వాత బూత్ లెవల్ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ స్థలానికి వెళ్ళి వెరిఫై చేస్తారు. అది కూడా రాత్రిపూట వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు. హోమ్‌లెస్ నిద్రిస్తున్న స్థలాన్ని గుర్తిస్తారు. అలా చేసినప్పుడు అప్లికేషన్‌లో చెప్పిన స్థలం, వారున్నది ఒకటే అయితే వెంటనే ఓటర్ కార్డు జారీ చేస్తారు. ఇంక దానికి ఎలాంటి డాక్యుమెంటరీ ఫ్రూఫ్‌లు సమర్పించవలసిన అవసరం లేదని చెప్పింది ఈసీఐ.

ఫామ్-6 ఫారాన్ని నింపాలి..
అయితే ఎవరైనా సరే ముందు ఓటర్‌గా నమోదు చేసుకోవడానికి కావాల్సిన ఫామ్-6 ఫారాన్ని(Form-6) నింపి ఇవ్వాల్సిందే. ఇందులో పేరు, తండ్రి / భర్త పేరు, వయసు / పుట్టిన తేదీ, స్త్రీ/పురుష/ఇతరులు లింగ వివరాలను సంబంధిత కాలమ్‌లలో ఎంటర్ చేయాలి. దాంతో పాటూ ఒక పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోను కూడా జత చేయాలి. దీని ద్వారానే బూత్ లెవల్ ఆఫీసర్లు సంబంధిత స్థలాలకు వచ్చి నిర్ధారణ చేసుకుంటారు. ఇలా నింపిన ఫామ్-6ను ప్రాంతీయ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి సమర్పించాలి.

ఓటరుగా నమోదు కోసం ఉండాల్సిన అర్హతలు
అయితే ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఇవి కచ్చితంగా ఉండి తీరాలి. మొదటగా అప్లై చేసుకునే వ్యక్తి భారతీయుడై ఉండాలి. 2024 జనవరి 1 నాటికి 18ఏళ్ల వయసు దాటుండాలి.నివాస ప్రాంతంలోనే ఓటరుగా నమోదు చేసుకొని ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటును నమోదు చేసుకోవడానికి కుదరదు.

Also Read : H1B Visa: హెచ్-1 బీ దరఖాస్తులకు ఆఖరు తేదీ మార్చి 22

#india #general-elections-2024 #homeless-voters #form-6
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe