Delhi: ఒకే ఒక్క క్లూ..22 ఏళ్ళుగా పరారీలో ఉన్న సిమి టెర్రరిస్ట్ పట్టిచ్చింది.

ఒక ఐడియా జీవితాన్ని మార్చేసింది అన్నట్టుగా ఒకే ఒక్క క్లూ ఎన్నో ఏళ్ళుగా తప్పించుకు తిరుగుతున్న సిమి ఉగ్రవాదిని పట్టిచ్చింది. 22 ఏళ్ళుగా పరారీలో ఉన్న హనీఫ్ షేక్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసేలా చేసింది.

Delhi: ఒకే ఒక్క క్లూ..22 ఏళ్ళుగా పరారీలో ఉన్న సిమి టెర్రరిస్ట్ పట్టిచ్చింది.
New Update

Terrorist: నిసేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఉగ్రవాది హనీఫ్ షేక్ ఢిల్లీ పోలీసులకు చిక్కాడు. 22 ఏళ్ళుగా ఇతను దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. 2022లో ఇతనిని పరారీలో ఉన్న నేరపస్తుడిగా ప్రకటించారు. ఇతనికి హనీఫ్ షేక్, మహ్మద్ హనీఫ్, హనీఫ్ హుదాయ్ అనే పేర్లు ఉన్నాయి. ఇన్నాళ్ళుకు హనీఫ్‌ను ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అది కూడా ఒకే ఒక్క క్లూ సాయంతో.

ఎలా దొరికాడు?

సిమి ఆధ్వర్యంలో హనీఫ్ చాలా నేరాలు చేశాడు. కానీ అన్నిటి నుంచీ దొరక్కుండా తప్పించుకున్నాడు. ఇస్లామిక్ మూవ్‌మెంట్ అనే మ్యాగజైన్‌కు హనీఫ్ ఎడిటర్‌గా ఉన్నాడు. హనీఫ్ హుదాయి అనే పేరుతో ఎడిటర్‌గా ఉండేవాడు. ఇది ఒక్కటే పోలీసుల దగ్గర ఉన్న ఆధారం. అంతకు ముందు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, కేరళల్లో జరిగిన సిమి సమావేశాల్లో ఇతను కీలక పాత్ర పోషించాడు. అప్పుడు వాటి మీద చేసిన దాడుల్లో అన్నిసార్లు హనీఫ్ తప్పించుకున్నాడు.అతను చేసిన నేరాలకు వేటికీ ఆధారాలు కూడా లేవు. కానీ మ్యాగజైన్‌లో అతనుపెట్టుకున్న పేరుతోనే..ఆ ఒక్క క్లూతోనే ఢిల్లీ సదరన్ రేంజ్ స్పెషల్ సెల్ హనీఫ్ కోసం నాలుగేళ్ళుగా వెతుకుతోంది. ఇతని సమాచారాన్ని అన్ని రాష్ట్రాలకూ పంపించారు. ఏడు రాష్ట్రాల్లో ఇన్ఫార్మర్లను ఏర్పాటు చేశారు.

చివరకు హనీఫ్‌ను మహారాష్ట్రలో అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. హనీఫ్ షేక్ తన గుర్తింపును మార్చుకుని మహారాష్ట్రలోని భుసావల్‌లోని ఒక ఉర్దూ పాఠశాలలో పనిచేస్తున్నట్లు ఇన్ఫార్మర్లు సమాచారం అందించారు. దీంతో పోలీసులు పక్కా ప్లాన్చేసుకుని హనీఫ్‌ను అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 22న మహ్మదీన్ నగర్ నుంచి ఖడ్కా రోడ్డుకు వెళుతున్న అనుమానాస్పద వ్యక్తిని హనీఫ్‌గా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హనీఫ్ షేక్ 1997లో సిమిలో చేరాడు. అప్పటి నుంచి అతను ఉగ్రవాదం వైపు పయనించాడు. అంతేకాదు తన మాటలతో పలువురు ముస్తిం యువకులను ప్రబావితం చేసి సిమిలో కూడా చేర్చుకున్నాడు. ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఉర్దూ ఎడిషన్‌లో హనీఫ్‌ ఎడిటర్‌గా ఎన్నో రెచ్చగొట్టే వ్యాసాలు కూడా రాశాడు. 2001లో పోలీసులు దాడి చేసినప్పుడు అతను మరికొంతమందితో కలిసి అండర్‌గ్రౌండ్‌కు వెళ్ళాడు. తర్వాత సిమి మీద నిషేధం విధించడంతో వహ్దత్-ఎ-ఇస్లాం పేరుతో కొత్త సంస్థను సళాపించారు. అప్పటి నుంచీ ఈసంస్థతోనే ఉన్నాడు హనీఫ్. ఇతనికి భార్యా, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Also Read:Cotton Candy: కాటన్ కాండీ తింటే క్యాన్సర్ వస్తుందా..ఎందుకు దీన్ని కొన్ని రాష్ట్రాలు నిషేధించాయి?

#simi #manhunt #terrorist #delhi-police
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe