ఎక్కువ-తక్కువ...ఇది అన్ని చోట్లా ఉంటుంది. మతం, కులం, డబ్బు, రంగు ఇలా ఒకటేమిటి..ఈ జాడ్యం అన్ని చోట్లా వ్యాపించేసింది. అది ఈ మధ్య మరీ మితిమీరిపోతోంది కూడా. అసలే దేశంలో మతాలు, కులాల గొడవ ఎక్కువగా ఉందంటే ఇప్పుడు దానికి తోడు క్లాస్-మాస్, డబ్బున్నోళ్ళు-పనివాళ్ళు అంటూ తేడాలు కూడా పెరిగిపోయాయి. దీనికి నిదర్శనమే తాజాగా హైదరాబాద్ లో ఓ అపార్ట్‌మెంట్‌లో దర్శనమిచ్చిన నోటీసు బోర్డు.
Also read:గ్రేటర్ పరిధిలో కింగ్ మేకర్ ఎవరు?
హైదరాబాద్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో రెండు లిఫ్టులున్నాయి. అందులో ఒకటి ఉండేవాళ్ళకు...రెండోది ఇళ్ళల్లో పనిచేసేవాళ్ళకు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ అందులో ఒక లిఫ్ట్ మీద పెట్టిన నోటీసే ఏంటీ మనుషులు అనిపించేలా ఉంది. ఆ అపార్ట్‌మెంట్‌లో టెనెంట్స్, ఓనర్స్ వాడే లిఫ్ట్ను పని వాళ్ళు వాడకూడదు అని రూల్ పెట్టారు. సరే ఇది కూడా ఒప్పుకుందాం అని అనుకుంటే...ఆ లిఫ్ట్ వాడితే వెయ్యి రూపాలయల ఫైన్ కట్టాలి అని అనడమే చాలా దారుణంగా మారింది. ఇలాంటివి చూసినప్పుడే అరే ఏంది రా భయ్...మనమెటు పోతున్నాం అనిపిస్తుంది. 21 సెంచురీలో మనుషులు ఇలా క్కూడా ఆలోచిస్తారా..ఛీ అనిపించకమానదు.
ఇండియాలో మొదటి నుంచి తక్కువ పని, ఎక్కువ పని అన్న భేదభావం ఉంది. ఇప్పుడు దాన్ని మరింత బూతద్ధంలో చూపిస్తున్నారు. పాశ్చాత్య కల్చర్ అంటూ చెత్తవి అన్నీ నేర్చుకుంటున్నాం కానీ ఈక్వాలిటీని మాత్రం అస్సలు నేర్చుకోవడం లేదు. అసలు అటు వైపు చూడాలని కూడా అనుకోవడం లేదు. అక్కడకు వెళ్ళి వచ్చాం అని గొప్పులు చెప్పేవాళ్ళు కూడా ఇక్కడకు వచ్చి ఈ తేడాలు చూపిస్తారు. హైదరాబాద్ లో అపార్ట్ మెంట్ లిఫ్ట్, దాని మీద నోటీస్ ఫోటోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారో యూజర్. దానికి బోలెడంత రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇందులో మెజారిటీ జనం అపార్ట్ మెంట్ మేనేజ్ మెంట్‌ను, అక్కడున్న వారిని తిడుతుంటే..కొందరు మాత్రం అది చాలా కామన్...అందులో తప్పేముందీ అంటూ కామెంట్లు పెడుతూ తమ బుర్రల్లో ఉన్న కుళ్ళును బయటపెట్టుకున్నారు.