bathing: స్నానానికి చన్నీళ్లు, వేడి నీళ్లలో ఏవి మంచివో తెలుసా?

చాలా మంది స్నానం చేసేటప్పుడు శరీరంలోని కొన్ని భాగాలపై సరైన శ్రద్ధ పెట్టరు. దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్‌ ఉంది. అందువల్ల.. ముఖ్యంగా మోచేతులు, అండర్ ఆర్మ్స్ వంటి ప్రాంతాలను శుభ్రం చేసుకోవాలి. కానీ.. చర్మానికి హాని కలిగించే స్నానం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

bathing: స్నానానికి చన్నీళ్లు, వేడి నీళ్లలో ఏవి మంచివో తెలుసా?
New Update

చిన్నతనంలో ప్రతిరోజూ అమ్మమ్మ, నానమ్మలు పిల్లలకు స్నానం చేయించేటప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారా..? ఒకటికి రెండు సార్లు రుద్దీరుద్దీ స్నానం చేయించేవారు. దీంతో పసి పిల్లలు ఏడుపులంకించుకుంటారు. ఇలా ప్రతీరోజు స్నానం చేయించిన ప్రతీసారి పిల్లల్ని వారు ఏడిపిస్తుంటారు. మోకాళ్లు, మోచేయి, ముక్కు చీదించడం, చెవుల వెనుక శుభ్రం చేయడం వంటివి చేస్తుంటారు. నేటికీ చిన్న పిల్లలకి స్నానం చేయించేటప్పుడు కూడా అదే పద్ధతిని పాటిస్తున్నారు. అయితే.. ఇలా ఎందుకు చేస్తారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? అయితే.. చర్మంపై ఉండే చిన్న చిన్న సూక్ష్మజీవులను స్నానం చేసేటప్పుడు శుభ్రంగా క్లీన్‌ చేయకపోతే వివిధ రకాల చర్మ వ్యాధులు వస్తాయి. కాగా.. చాలామంది స్నానం సరిగ్గా చేయకుండా.. హడావుడిగా చేస్తారు. సరిగ్గా స్నానం చేయకపోతే శరీరంపై ఉన్న సూక్ష్మజీవులు ఆవాసం ఏర్పాటు చేసుకుంటాయి. దీంతో శరీరంపై చెమట, మురికి, మృత కణాలను తొలగించడానికి లైట్ స్క్రబ్బింగ్ చేయాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీని ద్వారా శరీరం మొత్తం శుభ్రం చేయడం సులువుగా ఉంటుంది.

స్పాంజిని వాడితే మంచిది

ప్రతీరోజు స్నానానికి గోరువెచ్చని నీరు- వేడి, చల్లటి నీటిలో ఏది వినియోగించాలో చాలామందికి తెలియదు. ఎల్లప్పుడూ స్నానానికి గోరువెచ్చని నీటిని మాత్రమే వాడాలి. వాష్‌క్లాత్‌తో స్క్రబ్బింగ్ చేసుకోవాలి. ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది శరీరాన్ని స్క్రబ్ చేయడానికి లూఫా మరియు సింథటిక్ స్క్రబ్బర్‌ని వాడుతున్నారు. కానీ.. అమ్మమ్మ పద్ధతిలో వాడేది మంచిది. స్క్రబ్బింగ్ కోసం ఎక్స్‌ఫోలియేషన్, క్లీనింగ్ కోసం మృదువైన వాష్‌క్లాత్ లేదా స్పాంజిని వాడితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. స్నానం చేసిన తర్వాత గట్టిగా రుద్దడం కంటే.. మెత్తని టవల్‌తో శరీరాన్ని పొడిగా అద్దడం మంచిది.

శరీరాన్ని అతిగా శుభ్రపరచుకోవడం చేయకూడదు

ముఖ్యంగా స్నానం చేసేటప్పుడు నాభి, చెవులు, కాళ్లు, గోళ్ల శుభ్రం చేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే.. ఈ ప్రదేశాల్లో చెమట, దుమ్ముధూళి, మలినాలు వంటి ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా.. శరీర శుభ్రత కోసం శరీరాన్ని అతిగా శుభ్రపరచుకోవడం చేయకూడదు. మన చర్మంలో రెండు రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి.. మంచి బ్యాక్టీరియా సహజంగా సమతుల్యంగా ఉంటుంది.. కానీ.. శరీరానికి వేడి నీటిని వాడినప్పుడు.. వాటి సమతుల్యత దెబ్బతింటాయి.

#helth-tips #bathing #hot-or-cold-water
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe