ఘోర రోడ్డు ప్రమాదం..ఆగి ఉన్న బస్సును ఢీకొన్న ట్రక్కు..ఆరుగురు మృతి! గోరఖ్‌పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న బస్సును వెనక నుంచి వచ్చిన ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 గురు మరణించగా 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. By Bhavana 10 Nov 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి గోరఖ్‌పూర్- ఖుషీనగర్ హైవే పై గురువారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగదీష్‌పూర్ సమీపంలో అర్థరాత్రి వేగంగా వచ్చిన ట్రక్కు రెండు బస్సులను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా..మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని అంబులెన్స్ లలో జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రోగులకు సంబంధించి సదర్ ఆసుపత్రి , వైద్య కళాశాల వైద్యులతోనూ అధికారులు సంప్రదింపులు జరిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స అందించడానికి మరింత మంది వైద్యులను ఆసుపత్రులకు పిలిపించారు. ప్రమాదంలో మృతి చెందిన ఆరుగుర్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసులుకు తెలిసిన సమాచారం ప్రకారం..గోరఖ్‌పూర్ నుంచి కాంట్రాక్ట్ బస్సు ప్రయాణికులతో పరౌనా వైపు వెళ్తుంది. Also read: ధనత్రయోదశి, శని త్రయోదశి రెండు ఒకే రోజు వచ్చాయి…ప్రత్యేకత ఏంటో తెలుసా! ఈ క్రమంలో జగదీష్‌పూర్ లోని మల్లాపూర్ సమీపంలో బస్సు టైర్ పంక్చర్ అయ్యింది. ఆ క్రమంలోనే బస్సు ను డ్రైవర్ రోడ్డు పక్కన నిలిపి వేయగా..మరో బస్సు కోసం కండక్టర్ ఫోన్ చేశాడు. చనిపోయిన వారిలో నలుగురిని గుర్తించగా మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉంది. చనిపోయిన వారిలో నంద్‌లాల్ పటేల్ కుమారుడు శైలేష్ పటేల్ (25) తుర్కపట్టి , ఖుషీనగర్ లో నివాసం ఉంటున్న జవహీర్ చౌహాన్ కుమారుడు సురేష్ చౌహాన్ (35), మదర్హా, హత కుషినగర్‌లో నివాసముంటున్న అశోక్ సింగ్ కుమారుడు నితేష్ సింగ్ (25), హిమాన్షు యాదవ్ ఉన్నారు. బన్సారీ యాదవ్ (24) నివాసి మిస్రిపట్టి పదరౌనా, ఖుషీనగర్‌లో ఉన్నారు. #bus-accident #uttarapradesh #gorakh-pur మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి