Home Remedies : తేనెని ఇలా రాస్తే కాలిన గాయాలు, మచ్చలు తగ్గిపోతాయట..

వంట చేసినప్పుడు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కొన్నిసార్లు చేతులు, కాళ్ళు కాలడం జరుగుతాయి. ఈ మచ్చలు పోవడానికి కొన్ని ఇంటి చిట్కాలు తెలుసుకుందాం.

Home Remedies : తేనెని ఇలా రాస్తే కాలిన గాయాలు, మచ్చలు తగ్గిపోతాయట..
New Update

Honey : అనుకోకుండా శరీరం(Body) పై చాలా మచ్చలు(Moles) పడుతుంటాయి. వీటిని పోగొట్టుకోవాలంటే కొన్నిసార్లు కష్టమువుతుంది. వీటికోసం క్రీమ్స్, థెరపీలు తీసుకునేముందు ఇంటి చిట్కాలు(Home Remedies) ఈ సమస్యకి పరిష్కారాన్ని ఇస్తాయి. అయితే, అవి ఏ ప్రదేశంలో కాలింది. ఎంత మేరకు కాలింది అనేదానిపై ట్రీట్‌మెంట్ ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోండి.

తేలికపాటి కాలిన గాయాలకి చర్మ పై భాగం మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. ఇది కాలక్రమేణా అదృశ్యమవుతాయి. రాన్రాను ఈ మచ్చలు తగ్గిపోతాయి. అయితే, ఫెయిర్ స్కిన్(Fair Skin) ఉన్నవారికి ఈ మచ్చలు ఎరుపు, పింక్ రంగులో మచ్చలు ఏర్పడితే నల్లని చర్మం ఉన్నవారికి ముదురు రంగులో ఉంటాయి. కొన్నిసార్లు ఇది తీవ్రమచ్చలుగా అలానే ఉండిపోతాయి. వీటికి మొదట్లో ఇంటిచిట్కాలు సరిపోతాయి.కాలిన గాయాల్ని నయం చేయడంలో మెంతులు కూడా ముందుంటాయి.ఇందుకోసం మెంతుల్ని రాత్రంతా నానబెట్టాలి. మరుసటి ఉదయం మెత్తని పేస్టులా చేయాలి. ప్రభావిత ప్రాంతంలో రాసి బాగా ఆరనివ్వండి. ఆపై నీటితో క్లీన్ చేయండి. రెగ్యులర్‌గా ఇలా చేయొచ్చు.కలబంద కూడా ఓ సహజ నివారణ.. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది చర్మాన్ని రిలాక్స్ చేస్తుంది. మచ్చల్ని తగ్గిస్తుంది.
ప్రభావిత ప్రాంతంపై అలోవెరా జెల్‌ని రాసి మసాజ్ చేయాలి. 30 నిమిషాల పాటు అలానే ఉంచి గోరువెచ్చని నీటితో క్లీన్ చేయాలి. రోజుకి రెండుసార్లు చేస్తే సమస్య తగ్గిపోతుంది. కొబ్బరినూనెలో కలిపి వాడొచ్చు.కొబ్బరినూనెలోనూ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిని బాహ్యంగా, అంతర్గతంగా వాడొచ్చు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. మచ్చల్ని రాకుండా చేస్తాయి. చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయి చర్మాన్ని మాములుగా చేస్తుంది. ఎరుపు, చికాకుని కూడా తగ్గిస్తుంది. ఇందులో రెండు చుక్కల నిమ్మరసం వేయాలి. నిమ్మరసం సహజ ఎక్స్‌ఫోలియెంట్. ఇది మచ్చల్ని తగ్గించడంలో ముందుంటుంది. ఇందులోని ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ చర్మంలోని మృతకణాలను తగ్గించి కొత్త కణాల పెరుగుదలని ప్రోత్సహిస్తుంది.
కొబ్బరినూనెని ముందుగా వేడి చేసి అందులో కొద్దిగా నిమ్మరసం వేసి కాలిన గాయంపై సున్నితంగా మసాజ్ చేయాలి. రాత్రుళ్ళు రాసి ఉదయాన్నే నీటితో క్లీన్ చేయాలి. దీని వల్ల మచ్చలు మాయమవుతాయితేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి కాలిన గాయాలని నయం చేస్తాయి. మచ్చల్ని తగ్గిస్తాయి. దీనిలోని మాయిశ్చరైజింగ్ గుణాలు కణజాల పునరుత్పత్తిని ప్రేరేపిస్తాయి. మీ చర్మ సంరక్షణకి హెల్ప్ చేస్తాయి.కాలిన ప్రాంతంలో తేనెని అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే రిజల్ట్ ఉంటుంది.

Also Read : టీడీపీకి బిగ్ షాక్.. యనమల కృష్ణుడు రాజీనామా..!

#home-remedies #best-health-tips #honey
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe