Dark Circles: ఈ సింపుల్ ట్రిక్స్‌తో డార్క్ సర్కిల్స్‌ను ఈజీగా తొలగించుకోవచ్చు! కంటి కింద డార్క్ సర్కిల్స్ తో కొంత మంది బాధపడుతుంటారు. కంటి కింద డార్క్ సర్కిల్స్ తొలగించడానికి కీరదోస ముక్కలు, అలోవెర జెల్, రోజ్ వాటర్, బాదం ఆయిల్, సరైన నిద్ర, పాలు,మంచి చిట్కాల పనిచేస్తాయి. వీటిని కోసం మొత్తం ఆర్టికల్‌ని చదవండి. By Archana 22 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి అమ్మాయిలకు అందం పై ప్రత్యేక శ్రద్ద ఉండడం సహజం. వారి ముఖ సౌందర్యాన్ని మరింత అందంగా చేయడానికి ఎన్నో రకాల బ్యూటీ ప్రాడక్ట్స్, హోం రెమెడీస్ ఫాలో అవుతారు. అయినా సరే కొన్ని సమస్యలకు పరిష్కారం ఉండదు. వాటిలో ఒకటి కంటి కొండ్ నల్లటి మచ్చలు లేదా డార్క్ సర్కిల్స్. కంటి కింద డార్క్ సర్కిల్స్ తొలగించడానికి ఎక్కువ శ్రమ అక్కర్లేదు. ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు. డార్క్ సర్కిల్స్ తొలగించే చిట్కాలు అలోవెరా జెల్ కంటి కింద నల్లటి మచ్చలు ఉన్న భాగంలో ఒక తిక్ లేయర్ అలోవెరా జెల్ రాయండి. ఆ తర్వాత కొద్ది సేపటి వరకు దాన్ని అలాగే ఉంచి శుభ్రం చేయండి. ఇలా చేస్తే ముఖం అందంగా కనిపిస్తుంది. పాలు ముఖ సౌదర్యాన్ని పెంచడంలో పాలు కూడా చర్మం పై మంచి ప్రభావాన్ని చూపుతాయి. డార్క్ సర్కిల్స్ సమస్య ఉన్నవారు ఒక కాటన్ తీసుకొని దాన్ని పాలలో ముంచి 15 నిమిషాల పాటు నల్లటి మచ్చలు ఉన్న భాగంలో పెట్టండి. దీనిలోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మశ్చురైజ్ చేసి డార్క్ సర్కిల్స్ తగ్గించడానికి సహాయపడును. సరైన నిద్ర చర్మం ప్రకాశవంతగా, ఆరోగ్యంగా కనిపించడానికి నిద్ర చాలా ముఖ్యం. సరైన నిద్ర లేనప్పుడు కళ్ళ కింద డార్క్ సర్కల్స్ ఏర్పడతాయి. రోజుకు 8-9 గంటల నిద్ర తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. నిద్రతో పాటు నీళ్ళు కూడా బాగా తీసుకోవాలి. దీని వల్ల చర్మం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంటుంది. బాదం నూనె రోజూ రాత్రి పడుకునే ముందు స్కిన్ కేర్ రొటీన్ తప్పకుండా పాటించాలి. డార్క్ సర్కిల్స్ ఉన్నవారు పడుకునే ముందు బాదం నూనెతో కళ్ళ కింద మసాజ్ చేయండి. దీనిలోని విటమిన్ E నల్లటి మచ్చలు తగ్గించును. కీర దోసకాయ కీర దోసకాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని కొంత సమయం కంటి పై పెట్టుకుంటే డార్క్ సర్కిల్స్ పై మంచి ప్రభావం చూపుతాయి. కీర దోసకాయ లోని యాంటీ ఆక్సిడెంట్స్, కూలింగ్ గుణాలు నల్లటి మచ్చలను తగ్గిస్తాయి. రోజ్ వాటర్ పత్తిని రోజ్ వాటర్ లో నానబెట్టి దానిని నల్ల మచ్చల పై ఒక 15 నిమిషాల పాటు ఉంచండి. ఆ తర్వాత ముఖాన్ని మంచి నీటితో శుభ్రం చేయండి. రోజూ ఇలా చేస్తే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ తగ్గడానికి సహయపడుతుంది. Also Read: కరోనాతో కలవరం వద్దు.. ఈ జాగ్రత్తలు పాటించండి..! #life-style #beauty-tips #dark-circles మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి