Face Pimples: ముఖంపై మొటిమలు మాయం చేసే ఇంటి చిట్కాలు చాలా మందికి చిన్న మొటిమలు ఎక్కువగా ముఖం, చేతులు, భుజాలు, నడుముపై వస్తుంటాయి. ఒక్కసారిగా ఈ మొటిమలు రావడంతో చర్మం ఎరుపుగా మారడం, వాపు వంటి సమస్యలు పెరుగుతాయి. మొటిమలు వచ్చిన వెంటనే రోజుకు రెండుసార్లు ముఖం కడుక్కోవాలి. మొటిమలు తగ్గించే చిట్కాల కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి. By Vijaya Nimma 22 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Face Pimples: ముఖంపై చిన్న మొటిమలు రావడం సర్వసాధారణం. ఈ సమస్య వేసవి కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. చిన్న మొటిమలు ముఖం మీద మాత్రమే కాకుండా శరీరంలోని ఏ భాగానైనా కనిపిస్తాయి. అయితే మొటిమలను పదేపదే తాకడం, వత్తడం చేయకూడదని నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల మొటిమలు మరింత పెరిగి చర్మం ఎర్రగా మారే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. మొటిమలు రావడానికి కారణం: చాలా మందికి చిన్న మొటిమలు ఎక్కువగా ముఖం, చేతులు, భుజాలు, నడుముపై వస్తుంటాయి. ఒక్కసారిగా ఈ మొటిమలు రావడంతో చర్మం ఎరుపుగా మారడం, వాపు వంటి సమస్యలు పెరుగుతాయి. రోజూ స్నానం చేయకపోవడమే దీనికి ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా మొటిమలకు కారణం కావచ్చు. అంతే కాకుండా ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, పరిశుభ్రత లోపించడం వంటివి కూడా కారణం. నీళ్లు ఎక్కువగా తాగకపోవడం వల్ల కూడా మొటిమలు వస్తాయని వైద్యులు అంటున్నారు. మొటిమలు ఎలా పోగొట్టుకోవాలి? మొటిమలు వచ్చిన వెంటనే రోజుకు రెండుసార్లు ముఖం కడుక్కోవాలి. అంతేకాకుండా జుట్టులో చుండ్రు లేకుండా చూసుకోవాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. అలాగే అలోవెరా జెల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. పసుపు, గంధపు పొడిని నీటిలో కలిపి పేస్ట్‌లా చేసి మొటిమలు ఉన్న ప్రదేశంలో రాస్తే ఉపశమనం లభిస్తుంది. వేప ఆకులను నీటిలో ఉడకబెట్టి దాని పేస్ట్‌ను మొటిమలు ఉన్న ప్రదేశాలలో కూడా రాయవచ్చు. అంతే కాకుండా మొటిమలను తగ్గించడంలో కూడా తులసి పేస్ట్ బాగా పనిచేస్తుంది. సమస్య అలాగే ఉంటే మాత్రం వైద్యుడిని సంప్రదించాలి. ఇది కూడా చదవండి: పిల్లల్లో ఆకలిని పెంచే చిట్కాలు..ఇలా చేశారంటే వద్దన్నా తింటారు గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #helth-tips #helth-benefits #face-pimples మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి