Andhra Pradesh: వినాయక మండపాల రుసుములు రద్దు చేశాం: మంత్రి అనిత

జగన్‌ ప్రభుత్వ హయాంలో వినాయక మండపాల ఏర్పాటుకు వసూలు చేసే రుసుములను పది రోజుల కిందటే రద్దు చేశామని హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. సీఎం చంద్రబాబు నిర్ణయం మేరకు ఈ విధానాన్ని రద్దు చేశామని పేర్కొన్నారు.

New Update
Andhra Pradesh: వినాయక మండపాల రుసుములు రద్దు చేశాం: మంత్రి అనిత

జగన్‌ ప్రభుత్వ హయాంలో వినాయక మండపాల ఏర్పాటుకు వసూలు చేసే రుసుములను పది రోజుల కిందటే రద్దు చేశామని హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు దృష్టికి రావడంతో గత ప్రభుత్వం నిర్ణయించిన విధానాన్ని రద్దు చేసి.. ఒక్క రూపాయి కూడా తీసుకోవద్దని స్పష్టం చేశారని పేర్కొన్నారు. అలాగే వరద ముంపు బాధితులకు ఆహారం, మంచినీరు సరఫరా చేస్తున్నామని.. ఇంకా విజయవాడలో పలుచోట్ల నీరు నిలిచిపోయిందని పేర్కొన్నారు.

Also Read: ఇది జగన్ మేడ్ డిజాస్టర్.. లోకేష్ ఫైర్

ఇప్పటివరకు 27 వేలకు పైగా ఇళ్లల్లో బురదను అధికారులు తొలగించారని.. డ్రోన్లతో ఆహారం సరఫరాతో పాటు క్లోరినేషన్ చేపట్టామని.. కేవలం డ్రోన్ల సాయంతోనే లక్షకు పైగా ఆహార పొట్లాలు అందించామని తెలిపారు. వైఎస్‌ జగన్‌ మాత్రం కనీసం పులిహోర ప్యాకెట్ కూడా ఇవ్వకుండా పేటీఎం బ్యాచ్‌ను దింపి విష ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు.

Also Read: నాగార్జున యూనివర్సిటీలో విషాదం.. పాము కాటుకు బలైన విద్యార్ధి.!

Advertisment
Advertisment
తాజా కథనాలు