Home Minister: సెక్యూరిటీ సిబ్బందిని చెంప పై కొట్టిన హోంమంత్రి!

తెలంగాణ (Telangana) హోంమంత్రి(Home minister) మహమూద్‌ అలీ (Mohemmad ali) కోపానికి హద్దులు లేకుండా పోయాయి. కోపాన్ని కంట్రోల్‌ చేసుకోలేక తన సెక్యూరిటీ గార్ట్(Security guard) మీద చేయి చేసుకున్నారు.

Home Minister: సెక్యూరిటీ సిబ్బందిని చెంప పై కొట్టిన హోంమంత్రి!
New Update

తెలంగాణ (Telangana) హోంమంత్రి(Home minister) మహమూద్‌ అలీ (Mohemmad ali) కోపానికి హద్దులు లేకుండా పోయాయి. కోపాన్ని కంట్రోల్‌ చేసుకోలేక తన సెక్యూరిటీ గార్ట్(Security guard) మీద చేయి చేసుకున్నారు. శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ (Talasani srinivasayadav) పుట్టినరోజు సందర్భంగా ఆయన్ను కలిసి శుభాకాంక్షలు చెప్పటానికి అలీ తలసాని వద్దకు వెళ్లారు.

ఈ క్రమంలో ఆయన తలసానిని కౌగిలించుకుని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ సమయంలో ఆయనకు ఇవ్వడానికి తీసుకుని వచ్చిన పూల బొకే కనిపించలేదు. దీంతో దాని గురించి పక్కనే ఉన్న ఆయన సెక్యూరిటీ సిబ్బందిని పిలిచి బొకే గురించి అడిగారు. దానికి ఆయన లేదు అని సమాధానం చెప్పడంతో ..కోపాన్ని ఆపుకోలేని హోంమంత్రి అలీ వెంటనే ఆయన చెంప చెళ్లుమనిపించారు.

Also read: గోల్డ్ లోన్ తీసుకునే వారికి శుభవార్త..ఆర్బీఐ కీలక నిర్ణయం..ఏంటంటే..?

దీంతో పక్కన ఉన్న వారు ఎవరో సెక్యూరిటీకి పూలబొకే అందించడంతో వారు మంత్రికి ఆయన అందించారు. దానిని తీసుకుని ఆయన తలసాని కి అందించారు. సెక్యూరిటీ ని కొట్టడంతో తలసాని ఆయనకు సర్ది చెప్పారు. బొకే తలసానికి అందించడంతో అక్కడికి విషయం సద్దుమణిగింది.

కానీ ఈ ఘటన అంతటిని కూడా అక్కడే ఉన్న మీడియా వారు వీడియో తీయడంతో విషయం బయటకు వచ్చింది. సెక్యూరిటీ సిబ్బంది పై చేయి చేసుకోవడంతో సెక్యూరిటీ సిబ్బంది కూడా ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఏది ఏమైనప్పటికీ సెక్యూరిటీ సిబ్బంది మీద హోంమంత్రి చేయి చేసుకోవడం మాత్రం అందరూ తప్పు పడుతున్నారు.

కేవలం ఒక పూల బొకే కోసం ఓ వ్యక్తి మీద చేయి చేసుకోవడం సమంజసం కాదని నెటిజన్లు అంటున్నారు. 10 సెకన్లు ఆగితే పూలబొకే వచ్చేది కదా అంటూ వాపోతున్నారు. హోం మంత్రి మహమూద్ అలీ చర్యను పక్కనే ఉండి చూసిన మంత్రి తలసాని సైతం.. ఆ ఘటన తర్వాత హోం మంత్రి మహమూద్ అలీ చేతులు పట్టుకోవటం స్పష్టంగా కనిపిస్తుంది.

#telangana #home-minister #mahammad-ali
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe