Home Minister Anita: వారికి హోంమంత్రి అనిత మాస్ వార్నింగ్ AP: గంజాయి స్మగ్లర్స్, వినియోగదారులకు మంత్రి అనిత వార్నింగ్ ఇచ్చారు. గంజాయిపై బతికేద్దామనుకేవారి ఆటలు ఇకపై సాగవని అన్నారు. గంజాయి స్మగ్లింగ్, వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం అని చెప్పారు. గంజాయి విషయంలో ఏ రాజకీయ నాయకుడు ఉన్నా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. By V.J Reddy 17 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Home Minister Anita: గంజాయి స్మగ్లర్స్, వినియోగదారులకు మంత్రి అనిత వార్నింగ్ ఇచ్చారు. గంజాయిపై బతికేద్దామనుకేవారి ఆటలు ఇకపై సాగవని అన్నారు. గంజాయి స్మగ్లింగ్, వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం అని చెప్పారు. గంజాయి విషయంలో ఏ రాజకీయ నాయకుడు ఉన్నా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఎవరైనా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డ్రగ్స్, గంజాయి రహిత ఏపీగా మార్చాలన్నదే తమ ఎజెండా అని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రబీబి గంజాయి వణం చేసిందని.. యువత డ్రగ్స్ బారిన పడ్డారని మండిపడ్డారు. మంత్రి అనిత కామెంట్స్.. గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం.. గంజాయి కేసుల్లో అరెస్ట్ అయ్యి 1230 మంది విశాఖ జైలులో ఉన్నారు.. రాష్ట్రలో ఉన్న అన్ని జైలుల్లో కలిపి కేవలం 300 మంది మాత్రమే ఉన్నారు.. దీనిబట్టి విశాఖలో ఏ స్థాయిలో గంజాయి వాడకం ఉందో అర్ధం చేసుకోవచ్చు.. ఈరోజు నుంచి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చెయ్యాలని ఆదేశించాను.. ఎవరైనా గుంపులు.. గుంపులుగా ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించాను.. హోమ్ డిపార్ట్మెంట్ ను 5 ఏళ్లలో నిర్వీర్యం చేశారు.. గత ప్రభుత్వం పోలీసులకు ఇవ్వాల్సిన కనీస సౌకర్యాలు కల్పించలేదు.. గంజాయి వ్యాపారం చేద్దామనే ఆలోచన ఎవరికైనా ఉంటే వారు ఆ ఆలోచనను విరమించుకోవాలి.. విశాఖను గంజాయికి రాజధానిగా చేశారు.. గంజాయి స్మగిలింగ్ చేస్తే ఎవ్వరినైనా వదిలిపెట్టేది లేదు.. ఈరోజు నుంచి టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగుతుంది.. చెక్ పోస్ట్లు పెంచుతున్నాం.. విశాఖ సిటీలో 14 వందల సీసీ కెమెరాలు ఉంటే 7 వందలు మాత్రమే పని చేస్తున్నాయి.. మూడు నెలల్లో మార్పులు తీసుకొని వస్తాం.. విశాఖలో గంజాయి వాడకం లేకుండా చేస్తాం.. దిశా పోలీస్ స్టేషన్ల పేరు మార్చాబోతున్నాం.. అవి మహిళా పోలీస్ స్టేషన్లు.. ఇకపై దిశ పోలీస్ స్టేషన్లు ఉండవు.. Also Read: సోనియా, రాహుల్, ప్రియాంకను కలిసిన వైఎస్ షర్మిల #tdp #home-minister-anita మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి