Telangana Elections 2023: అవకాశమున్న చోటల్లా తెలంగాణ కోసం బీజేపీ పనిచేస్తోంది-అమిత్ షా

ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రహోం మంత్రి అమిత్ షా తెలంగాణలో ఉన్నారు. నిన్న రాష్ట్రానికి వచ్చిన ఆయన 3రోజులపాటూ ప్రచార సభల్లో, రోడ్ షోలలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడారు.

Amith Sha: కేంద్రమంత్రికి కారు లేదంట..ఎన్నికల అఫిడవిట్‌లో అమిత్‌ షా ఆస్తుల వివరాలు
New Update

Amit Shah in Telangana: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. నిన్న రాష్ట్రానికి వచ్చిన ఆయన మరో మూడు రోజులు ఇక్కడే ఉండనున్నారు. ఈరోజు హైదరాబాద్ లో ఆయన మీడియాతో బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం మీద విమర్శనాస్త్రాలు సంధించారు. దాంతో పాటూ ఈ రెండు టర్మ్ లలో కేంద్రంలో బీజేపీ (BJP) ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకొచ్చారు. 9 ఏళ్లలో మేము ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) చెప్పుకొచ్చారు.

Also Read:తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ

మేము అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను ఎత్తివేసి ఆ శాతాన్ని ఎస్సీ, ఎస్టీ , ఓబీసీలకు ఇస్తామని హామీ ఇచ్చారు. వరి పంట క్వింటాలుకు 3100 మద్దతు ధర ఇస్తాం,పెట్రోల్ డీజిల్ పై కస్టమ్ డ్యూటీ తగ్గిస్తామని చెప్పారు. దీన్ని ఇప్పటికీ తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేస్తున్నామని తెలంగాణలో కూడా అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. మా ప్రభుత్వం ఏర్పడగానే మొదటి కేబినెట్ మీటింగ్ లోనే ఈ హామీలకు ఆమోదం తెలుపుతామన్నారు.హైవేలు, రైల్వేలు, ఇతర మౌలిక వసతుల కల్పన, పరిశ్రమలు.. ఇలా అవకాశమున్నచోటల్లా తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. మాదిగ సామాజిక వర్గానికి దశబ్దాలుగా జరుగుతున్న అన్యాయానికి చరమగీతం పాడేందుకు నిర్ణయం తీసుకున్నాం. ఆ దిశగానే పనిచేస్తున్నామని అన్నారు. వెనుకబడిన వర్గాల రాజ్యాధికార ఆకాంక్షలకు అనుగుణంగా బీసీ అభ్యర్ధిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పామని అన్నారు అమిత్ షా.

కాంగ్రెస్ తెలంగాణ విరోధని అన్నారు అమిత్ షా. కాంగ్రెస్ పీవీ నరసింహారావు ను అవమానించిందని.. దీన్ని తెలంగాణ సమాజం మర్చిపోలేదని చెప్పారు. కాంగ్రెస్ అనేక మంది ప్రాణాలు బలితీసుకుందని విమర్శించారు. బీ అర్ ఎస్, కాంగ్రెస్ కు ఓటేస్తే అది ఓవైసీ కి వేసినట్టే అవుతుందని అన్నారు అమిత్ షా. బీ అర్ ఎస్, కాంగ్రెస్, MIM మూడు కుటుంబ పార్టీలు.. పార్టీలు అన్ని ఎన్నికల ముందు వేర్వేరు గా కొట్లడిన.. ఎన్నికల అనంతరం కలిసి పోతారని చెప్పారు.అందుకే బఈసారి బీజేపీ కి అవకాశమివ్వాలని అమిత్ షా కోరారు.

#amit-shah #telangana-elections-2023 #brs-party #bjp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe