BREAKING: వెయ్యి కోట్లగా పైగా ఆస్తులు.. ఏపీలోనూ ఫ్లాట్‌లు.. శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీలో నివ్వెరపరిచే నిజాలు!

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రేరా కార్యదర్శి బాలకృష్ణను ఏసీబీ అధికారులు విచారించారు. తెలంగాణతో పాటు వైజాగ్‌లోను ఆయనకు ప్లాట్‌లున్నాయని గుర్తించారు. 19 ఓపెన్ ప్లాట్లు, 7 అపార్ట్మెంట్ ప్లాట్లు , 3 విల్లాలు ఉన్నాయి. దాదాపు 1,000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది.

New Update
BREAKING: వెయ్యి కోట్లగా పైగా ఆస్తులు.. ఏపీలోనూ ఫ్లాట్‌లు.. శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీలో నివ్వెరపరిచే నిజాలు!

ACB Interrogation 8th day Siva Balakrishna: HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ (ACB) కస్టడీలో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటివరకు ఆయన పేరిట 214 ఎకరాలు ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. నవీన్‌ కుమార్‌ (Naveen Kumar) అరెస్ట్‌తో పాటు మరో ముగ్గురు బినామీలను గుర్తించారు. ఉన్నతాధికారుల పాత్రపై ఏసీబీ ఆరా తీస్తోంది. బ్యాంకు లాకర్స్‌లో 18తులాల బంగారాన్ని గుర్తించిన అధికారులు.. రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులపై దర్యాప్తు ముమ్మరం చేశారు. శివబాలకృష్ణకు దాదాపు 1,000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. HMDAలో కీలక ఫైల్స్‌ను ఏసీబీ స్వాధీనం చేసుకుంది.

శివ‌బాల‌కృష్ణపై ఇప్పటికే స‌స్పెన్షన్‌ వేటు:

రెరా కార్యర్శి (RERA Secretary) శివ‌బాల‌కృష్ణపై ఇప్పటికే స‌స్పెన్షన్‌ వేటు ప‌డింది. అతడిని స‌స్పెండ్‌ చేస్తూ హెచ్ఎండీఏ మెట్రో పాలిట‌న్ క‌మిష‌నర్ దాన కిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవ‌ల శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఏసీబీ యాక్ట్‌లోని యూ/ఎస్‌ 13(1)(బీ), 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడాయన చంచ‌ల్‌గూడ జైలులో (Chanchalguda Central Jail) రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రణాళిక విభాగం అధికారిగా కూడా శివబాలకృష్ణ గతంలో పనిచేశారు శివబాలకృష్ణ ఇల్లు, బంధువులు, స్నేహితుల ఇండ్లలో 16 చోట్ల సోదాల అనంతరం మొత్తం రూ.99,60,850 నగదు, 1,988 గ్రామాలు బంగారం, వజ్రాలతో కూడిన భరణాలతో పాటు దాదాపు 6 కిలోల వరకూ వెండి నగలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు రూ.5,96,27,495 విలువైన చర, స్థిర ఆస్తులను గుర్తించారు. సోదాల్లో లభించిన మొత్తం స్థిర, చర ఆస్తులు ప్రభుత్వ విలువ ప్రకారమే రూ.8,26,48,999 ఉంటాయని, అయితే, మార్కెట్‌లో వాటి విలువ రూ.వందల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

అడ్డదారిలో సంపాదించిన డబ్బుతో శివబాలకృష్ణ ఎక్కువగా భూములు (Lands) కొన్నట్లు ఏసీబీ గుర్తించింది. హైదరాబాద్‌ శివార్లతోపాటు కొడకండ్ల, కల్వకుర్తి, యాదాద్రి, జనగామల్లో వాటిని గుర్తించారని సమాచారం. దీంతోపాటు కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు కూడా పెట్టినట్లు సమాచారం. ఇంకా అదనపు ఆస్తులకు సంబంధించి పరిశీలనలు జరుగుతున్నాయి.

Also Read: మనీలాండరింగ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు షాక్, బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు..!!

Advertisment
తాజా కథనాలు