Hyderabad: హైదరాబాద్ లో హిట్‌ అండ్‌ రన్‌ ఘటన.. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా..

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అతివేగంతో ముందు వెళుతున్న బైక్ ను ఢీ కొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

New Update
Hyderabad: హైదరాబాద్ లో హిట్‌ అండ్‌ రన్‌ ఘటన.. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా..

Hyderabad: హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అతివేగంతో వెళ్తు అదుపుతప్పి ముందు వెళుతున్న బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వెనక కూర్చున్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా కారును ఆపకుండా డ్రైవర్ వేగంగా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

Also Read: షర్మిల ఎంట్రీతో ఏపీ కాంగ్రెస్‌లో ఊహించని మార్పులు..!

ఈ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిని తారక్ రాం(30) గా గుర్తించారు. అతడు నోవాటెల్‌ హోటల్‌లో బౌన్సర్‌ గా పనిచేస్తున్నట్లు సమాచారం. విధులు ముగించుకుని జూబ్లీహిల్స్‌ మీదుగా సికింద్రాబాద్‌ వెళ్తుండగా పెద్దమ్మగుడి కమాన్‌ వద్ద బైక్‌ ను కారు ఢీకొట్టింది. యాక్సిడెంట్ చేసిన కారుకు రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోవడంతో ఆ కారు ఎవరిది? ప్రమాదం ఎవరు చేశారు అనే వివరాలు తెలియరాలేదు. కారు వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Also Read: చంద్రబాబు బెయిల్‌పై సుప్రీంలో సవాల్ చేసిన ఏపీ సర్కార్.!

కాగా, మృతుడి తారక్ రాంకి ఇటీవలే వివాహం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  ఈ ప్రమాదంలో గాయపడ్డ యువకుడిని గాంధీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నామని, తారక్ రాం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు